Telangana MLC Elections: ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఆశలు వదులుకోవల్సిందేనా.. రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‎కి ఎలా సాధ్యం..

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. జనవరి 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ ఒకేసారి ఎమ్మెల్సీగా నామినేట్ కానందున ఒకే రోజు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎన్నికల కమిషన్.

Telangana MLC Elections: ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఆశలు వదులుకోవల్సిందేనా.. రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‎కి ఎలా సాధ్యం..
Telangana Mlc Elections
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 06, 2024 | 2:46 PM

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. జనవరి 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ ఒకేసారి ఎమ్మెల్సీగా నామినేట్ కానందున ఒకే రోజు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎన్నికల కమిషన్. ఎన్నికల నిబంధనల ప్రకారం రెండు సార్లు ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా రెండు సార్లు ఓటు హక్కును వినియోగించుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 64.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిలిచి విజయం సాధించాలంటే కనీసం 40 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. ఒకేసారి రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల కాంగ్రెస్ ఒకరినే ఎమ్మెల్సీగా గెలుచుకోగలుగుతుంది. బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో ఒక ఎమ్మెల్సీని సాధించగలుగుతుంది. అయితే తాజాగా ఏర్పడిన పరిణామాల వల్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న వారు మరో సారి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. జనవరి 29న రెండు సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు సార్లు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఇద్దరు ఎమ్మెల్సీలను గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ టెక్నికల్ అంశం ద్వారా కాంగ్రెస్‎లో ఆశావాహులకు అవకాశం అందినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..