Andhra Pradesh: పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకుని.. నిండు గర్భవతిని కిరాతకంగా హత్య చేసిన భర్త..
రామారావు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో 2019లో అన్నపూర్ణ అనే యువతిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల మౌనిక అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ నాలుగు నెలల గర్భవతి. అయితే రామారావు మొదటి భార్యను తన సొంత ఇంట్లో ఉంచి, రెండో భార్య అయిన తనను అద్దె ఇంట్లో ఉంచుతున్నాడని, అంతేకాకుండా కూతురు పుట్టిన తర్వాత సరిగా పట్టించుకోవడం లేదని అన్నపూర్ణ తన భర్త రామారావును ఎప్పటికప్పుడు నిలదీస్తుండేది.

గర్భవతి అని కూడా చూడకుండా భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ మానవత్వం లేని కసాయి భర్త. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడు అయిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లా బాడంగి మండలం కోటిపల్లి కి చెందిన వంగపండు రామారావు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో 2019లో అన్నపూర్ణ అనే యువతిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల మౌనిక అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ నాలుగు నెలల గర్భవతి. అయితే రామారావు మొదటి భార్యను తన సొంత ఇంట్లో ఉంచి, రెండో భార్య అయిన తనను అద్దె ఇంట్లో ఉంచుతున్నాడని, అంతేకాకుండా కూతురు పుట్టిన తర్వాత సరిగా పట్టించుకోవడం లేదని అన్నపూర్ణ తన భర్త రామారావును ఎప్పటికప్పుడు నిలదీస్తుండేది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు కూడా జరుగుతుండేవి. దీంతో ఎలాగైనా అన్నపూర్ణను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ పక్కా పన్నాగం పన్నాడు.
రెండో భార్యను హత్య చేయడానికి డేట్, టైమ్ కూడా ఫిక్స్ చేశాడు. అందులో భాగంగా భార్యకు మంచిమాటలు చెప్పాడు. అందులో భాగంగా అన్నపూర్ణతో కొద్ది రోజులు చనువుగా ఉన్నాడు. ఆమెను నవ్వించేవాడు. కవ్వించేవాడు. సరదాగా పొలం గట్టుకు వెళ్దాం అని నమ్మబలికాడు. అలా భార్యకు మాయమాటలు చెప్పి కోటిపల్లి కొత్తచెరువు వద్ద ఉన్న తన పొలానికి తీసుకెళ్ళాడు. పొలంలోనే నూతి వద్దకి తీసుకెళ్లి బలవంతంగా తోసేసి హత్య చేశాడు. ఆ తరువాత తనకు ఏమీ తెలియనట్టు అమాయకంగా ఇంటికి వచ్చాడు. తాను పొలంలో పనులు చేసుకుంటుంటే అన్నపూర్ణ ఎక్కడికో వెళ్లిపోయిందని, ఎంత సేపు చూసినా తిరిగి రాలేదని స్థానికులకు, అన్నపూర్ణ కుటుంబసభ్యులకు చెప్పాడు రామారావు.
దీంతో గ్రామస్తులు అన్నపూర్ణ కోసం గాలింపు చేపట్టారు. చివరికి పొలంలో ఉన్న బావిలో అన్నపూర్ణ విగతజీవిగా కనిపించింది. ఆ పరిస్థితిలో ఉన్న అన్నపూర్ణను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ముందుగా అన్నపూర్ణ ఆత్మహత్య చేసుకుందని అంతా అనుకున్నారు. తరువాత పోలీసులు తమదైన శైలిలో భర్త రామారావును విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో రామారావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. తల్లి మరణం, తండ్రి జైలు పాలయ్యాడు. మూడేళ్ల చిన్నారి మౌనిక అనాధ అయ్యింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..