Ambati Rayudu: ఏమైంది రాయుడు.. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ క్రికెటర్

వైఎస్సార్‌సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకిచ్చారు. గత గురువారం (డిసెంబర్ 28) పార్టీలో చేరిన రాయుడు.. 10 రోజుల తిరక్కుండానే సంచలన ప్రకటన చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు 'ఎక్స్' ద్వారా తెలిపారు.

Ambati Rayudu: ఏమైంది రాయుడు.. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ క్రికెటర్
Ambati Rayudu - CM Jagan
Follow us

|

Updated on: Jan 06, 2024 | 11:21 AM

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు. వైసీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తదుపరి ఏం చేయబోతున్నది తగిన సమయంలో వెల్లడిస్తాడని రాయుడు తెలిపాడు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు 10 రోజుల తిరక్కుండానే.. ఆ పార్టీని వీడటం తీవ్ర చర్చనీయాంశమైంది.

రాజకీయాలతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ షురూ చేస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం ఆనందంగా ఉందన్నారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన రాగద్వేషాలకు అతీతంగా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు సపోర్ట్‌గా గతంలో ట్వీట్లు పెట్టినట్లు తెలిపారు. అయితే ఈలోపే ఆయన వైసీపీని వీడటం మిస్టరీగా మారింది.

గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా రాజకీయాల మీద ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా వెసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. సీఎం జగన్‌కు మద్దతుగా పలుమార్లు ట్వీట్స్ వేశారు. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుని పార్టీలో చేర్చుకోవటం లాభిస్తుందని వైసీపీ భావించింది. అనుకున్నట్లుగానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక..  సీఎం జగన్‌కు కలిశారు రాయుడు. ఆ తర్వాత.. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలియతిరిగారు. పలు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం డిసెంబర్ 28న  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు గుంటూరు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది.

ఎంపీ సీటు పైన రాయుడుకు హామి ఇవ్వలేదా..? ఆయన అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారా..? అందుకు వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా..?  త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేయడం వెనుక అర్థం ఏంటి..? వేరే పార్టీలో చేరే ఉద్దేశంలో రాయుడు ఉన్నారా..? కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో జనసేనలోకి వెళ్తారా..?. ఈ ప్రశ్నలన్నింటికి రాయుడే సమాధానం చెప్పాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..