Weather Updates: రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. హెచ్చరించిన వాతావరణ శాఖ..

రాగల 24 గంటల్లో ఏపీ, తమిళనాడులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడించింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు చెప్పారు.

Weather Updates: రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాలకు వర్ష సూచన.. హెచ్చరించిన వాతావరణ శాఖ..
Weather Report
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 22, 2024 | 8:18 PM

రాగల 24 గంటల్లో ఏపీ, తమిళనాడులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడించింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు చెప్పారు. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మొన్నటి వరకూ విపరీతమైన చలితో గజగజా వణికిపోయిన ఏపీ ప్రజలు ఈ వర్ష సూచనతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది. ఇక.. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చింతపల్లిలో ఎనిమిది డిగ్రీలు, అరకు లోయలో పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. మొన్నటి వరకు వరదల్లో తీవ్ర ఇబ్బందులకు గురైన తమిళనాడు ప్రజలు మరోసారి వర్ష సూచనతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ సారి పెద్దగా ముంపు వాటిల్లే ప్రమాదం లేదని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గతంలో మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడుకు అలాంటి పరిస్థితి తలెత్తిందని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles