కొంపముంచిన కాల్.. లక్షలకు టోకరా

కొంపముంచిన  కాల్.. లక్షలకు  టోకరా

మోసపోయేవాళ్లుంటే మోసగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో రంగంలోకి దిగుతూనే ఉంటారు. ఇప్పటి వరకు లాటరీ పేరుతో ఫోన్ కాల్స్ రావడం, అవతలివారు అడిగినంత చెల్లించుకోవడం చివరికి మోసపోవడం వంటి మోసాలు తెలిసినవే. తాజాగా వెలుగుచూసిన ఉదంతం మాత్రం కొంచెం కొత్తగా ట్రైచేసి ట్రాప్ చేశారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి( 54) అనే వ్యక్తికి లక్కీడీప్‌తె నగదు గెలుచుకున్నారంటూ జూలై నెలలో హెచ్‌డీఎఫ్‌డీ బ్యాంకు చెక్కు నుంచి రూ.12.72 లక్షల ఆ చెక్కు వచ్చింది. స్వయంగా చంద్రమౌళి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2019 | 6:07 PM

మోసపోయేవాళ్లుంటే మోసగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో రంగంలోకి దిగుతూనే ఉంటారు. ఇప్పటి వరకు లాటరీ పేరుతో ఫోన్ కాల్స్ రావడం, అవతలివారు అడిగినంత చెల్లించుకోవడం చివరికి మోసపోవడం వంటి మోసాలు తెలిసినవే. తాజాగా వెలుగుచూసిన ఉదంతం మాత్రం కొంచెం కొత్తగా ట్రైచేసి ట్రాప్ చేశారు.

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన చంద్రమౌళి( 54) అనే వ్యక్తికి లక్కీడీప్‌తె నగదు గెలుచుకున్నారంటూ జూలై నెలలో హెచ్‌డీఎఫ్‌డీ బ్యాంకు చెక్కు నుంచి రూ.12.72 లక్షల ఆ చెక్కు వచ్చింది. స్వయంగా చంద్రమౌళి పేరుతో ఆ చెక్ ఉండటంతో నిజమే అనుకున్నాడు. ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపారసంస్ధ నాప్‌టాల్ లక్కీడీప్‌లో ఈ బహుమతి గెలుచుకున్నారని ఈ చెక్కతోపాటు ఉన్న లెటర్‌లో రాసి ఉంది. దీంతో ఇది నిజమా అబద్దమా అని నిర్ధారించుకునేందుకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అడిగితే నిజమేనని బదులు వచ్చింది. దీంతో వెంటనే మోసగాళ్లు.. తెలివిగా ప్లాన్ చేసి చంద్రమౌళి బ్యాంకు డీటైల్స్, వ్యక్తిగత డేటా అన్నీ సేకరించారు. అప్పటినుంచి చెక్కు క్లియర్ అవ్వాలంటే మొత్తం ఛార్జీలు చెల్లించాలని నమ్మబలికారు. ఈ మోసాన్ని గ్రహించని బాధితుడు చంద్రమౌళి ఏకంగా రూ.4.28 లక్షల్ని కైలాష్ పండర్, నిఖిల్‌రాయ్ పేరుతో ఉన్న ఎస్‌బీఐ ఖాతాలకు డబ్బులు పంపించాడు.

జూలై 27 నుంచి ఆగస్టు 5 తేదీ వరకు ఇలా పలు దఫాల్లో డబ్బు వారి ఎకౌంట్‌లో వేస్తున్నా.. మళ్లీ ఆర్బీఐ చార్జీల కింద మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో బాధితుడు చంద్రమౌళికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే వారిని నిలదీయడంతో అప్పటినుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు చంద్రమౌళి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu