సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ..

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో గత అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 3 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఇంట్లో ఉన్న వాచ్‌మెన్ తో పాటు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. […]

సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 27, 2019 | 5:46 PM

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి బంధువుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో గత అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 3 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఇంట్లో ఉన్న వాచ్‌మెన్ తో పాటు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజీని కూడ పరిశీలిస్తున్నారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.