బ్రేకింగ్: శ్రీవారి ఆభరణాలు మాయం.. టీటీడీలో మరో వివాదం
తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో మళ్లీ రచ్చ మొదలైంది. శ్రీవారికి సంబంధించిన కొన్ని ఆభరణాలు మాయం అయినట్లు తెలుస్తోంది. టీడీడీ ట్రెజరీలోని శ్రీవారి 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా అదృశ్యం అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆలస్యంగా స్పందించిన అధికారులు టీడీపీ ఏఈవో పై చర్యలు తీసుకున్నారు. అయితే పోయిన ఆభరణాలకు సంబంధించి అతడి జీతం నుంచి డబ్బు రికవరీ చేసి చేతులు దులుపుకున్నారు. కాగా, ఆభరణాలు […]
తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో మళ్లీ రచ్చ మొదలైంది. శ్రీవారికి సంబంధించిన కొన్ని ఆభరణాలు మాయం అయినట్లు తెలుస్తోంది. టీడీడీ ట్రెజరీలోని శ్రీవారి 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా అదృశ్యం అయినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆలస్యంగా స్పందించిన అధికారులు టీడీపీ ఏఈవో పై చర్యలు తీసుకున్నారు. అయితే పోయిన ఆభరణాలకు సంబంధించి అతడి జీతం నుంచి డబ్బు రికవరీ చేసి చేతులు దులుపుకున్నారు. కాగా, ఆభరణాలు ఏమయ్యాయో ఇప్పటివరకూ విచారణ చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత కల్పించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా వుంటే, మరోవైపు శ్రీవారి అభరణాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీటీడీ అధికారుల తీరును వారు తప్పుబడుతున్నారు. శ్రీవారి ప్రతిష్టకు కళంకం తెచ్చే విధంగా టీటీడీ ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగల మాయం వెనుక అసలు కారకులెవరు..? పోయిన సొత్తుకు ఒకరిని బాధ్యుడ్ని చేసి ఏఈవో శ్రీనివాసుల జీతం నుంచి రికవరీ చేయడం ఏమిటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. స్వామివారి నగల మాయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.