అది దొంగిలించిన సొమ్ము.. రాహుల్ గాంధీ ఫైర్

అది దొంగిలించిన సొమ్ము.. రాహుల్ గాంధీ ఫైర్

రిజర్వ్ బ్యాంకు 1. 76 లక్షల కోట్ల మిగులు నిధులను మోదీ ప్రభుత్వానికి బదలాయించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆర్బీఐ నుంచి ‘ దొంగిలించిన సొమ్ము ‘ దేశ ఆర్ధిక వ్యవస్థకు సహాయపడదని ఈ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది బ్యాంకును లూటీ చేయడమే అన్నారు. దాదాపు ఇన్ని నిధులు 2019 బడ్జెట్ ఎనౌన్స్ మెంట్ నుంచి ‘ మిస్ ‘ అయ్యాయని కాంగ్రెస్ తన ట్విట్టర్లో పేర్కొంది. ఆ నిధులను ఎక్కడ ఖర్చు […]

Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2019 | 2:25 PM

రిజర్వ్ బ్యాంకు 1. 76 లక్షల కోట్ల మిగులు నిధులను మోదీ ప్రభుత్వానికి బదలాయించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆర్బీఐ నుంచి ‘ దొంగిలించిన సొమ్ము ‘ దేశ ఆర్ధిక వ్యవస్థకు సహాయపడదని ఈ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది బ్యాంకును లూటీ చేయడమే అన్నారు. దాదాపు ఇన్ని నిధులు 2019 బడ్జెట్ ఎనౌన్స్ మెంట్ నుంచి ‘ మిస్ ‘ అయ్యాయని కాంగ్రెస్ తన ట్విట్టర్లో పేర్కొంది. ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారు ? బడ్జెట్ ప్రకటనలో నుంచి అవి ఎందుకు కనబడకుండా పోయాయి అని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇలా రిజర్వ్ బ్యాంకును దోపిడీ చేయడం మన ఆర్ధిక వ్యవస్థకు మరింత చేటు తెస్తుందని, ఆర్బీఐ క్రెడిట్ రేటింగును తగ్గిస్తుందని విమర్శించింది. తాము స్వయంగా సృష్టించిన ఆర్ధిక సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలియదని రాహుల్ తన ట్విట్టర్లో ఆరోపించారు. రిజర్వ్ బ్యాంకు నుంచి దొంగతనం చేయడం ఫలితమివ్వదని, ఇది డిస్పెన్సరీ నుంచి బ్యాండ్ ఎయిడ్ ను చోరీ చేసి తుపాకీ గాయమైన చోట అంటించడమే అవుతుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా దాదాపు ఇలాగే ట్వీట్ చేశారు. బడ్జెట్ లెక్కల్లో మిస్ అయిన సొమ్మును ఈ 1. 76 లక్షల కోట్లతో భర్తీ చేస్తారా ? ఇది కాకతాళీయమా అని ఆయన ప్రశ్నించారు. పైగా ఇది ఆర్ధిక దోపిడీయా లేక గారడీయా ? మీ పార్టీ (బీజేపీ) ఫ్రెండ్స్ ని ఆదుకోవడానికి ఈ సొమ్మును వినియోగిస్తారా అని కూడా ప్రశ్నించారు. ఆర్బీఐ నుంచి భారీ సొమ్మును తీసుకోవడం ఆర్ధిక పరిస్థితిని మరింత దెబ్బ తీస్తుందని, యుధ్ధం వంటి పరిస్థితులను సృష్టిస్తుందని సుర్జేవాలా పేర్కొన్నారు. ‘ మోదీ 2. 0 ప్రభుత్వం ; ఆర్ ‘ అన్న అక్షరాన్ని రిజర్వ్ (బ్యాంకు) నుంచి మరో ” ఆర్ ” (రావెజ్డ్) అంటే ‘ వినాశనం ‘ అన్న అక్షరంగా మార్చినట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. రిజర్వ్ బ్యాంక్ విశ్వసనీయతను బీజేపీ దెబ్బ తీస్తోందని అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu