AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలర్ట్: ఏటీఎం విత్‌డ్రాలపై పరిమితి.. రోజుకు ఒక్కసారే.!

బ్యాంక్, ఏటీఎం మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించే దిశగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు ఏటీఎం లావాదేవీల మధ్య 6నుంచి 12గంటల గ్యాప్ ఉండేలా కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలో తమ ప్రతిపాదనను బ్యాంకర్లు వ్యక్తపరిచారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కస్టమర్లు ఏటీఎం నుంచి డబ్బులు నిర్ణీత సమయంలో తీసుకోవడానికి వీలుండదు. ఇక వీటితో పాటు కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఏటీఎంలకు సెంట్రలైజ్‌డ్ […]

అలర్ట్: ఏటీఎం విత్‌డ్రాలపై పరిమితి.. రోజుకు ఒక్కసారే.!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 27, 2019 | 1:30 PM

Share

బ్యాంక్, ఏటీఎం మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించే దిశగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు ఏటీఎం లావాదేవీల మధ్య 6నుంచి 12గంటల గ్యాప్ ఉండేలా కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలో తమ ప్రతిపాదనను బ్యాంకర్లు వ్యక్తపరిచారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కస్టమర్లు ఏటీఎం నుంచి డబ్బులు నిర్ణీత సమయంలో తీసుకోవడానికి వీలుండదు.

ఇక వీటితో పాటు కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఏటీఎంలకు సెంట్రలైజ్‌డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు ఆలోచిస్తున్నారు. ఇందులో ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని ఏటీఎం సెంటర్‌లోకి వెళ్తే.. ‘‘హెల్మెట్‌ను తొలగించండి’’ అనే వాయిస్ వినిపించనుంది. ఇదే విధానాన్ని బ్యాంకులలో కూడా ప్రవేశపెట్టాలని వారు అభిప్రాయపడ్డారు. ఇక కొన్ని ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డ్ లేకపోయినా.. కెమెరాతో ఆ ప్రదేశాన్ని కన్నేసి ఉంచనున్నారు.

కాగా ఏడాదేడాదికి ఏటీఎం మోసాలు పెరిగిపోతున్నారు. దేశంలో ఏటీఎం మోసాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక క్లోనింగ్ ద్వారా కూడా ఏటీఎం మోసాలు ఎక్కువగా జరుగుతుండగా.. ఈ చర్యలకు పాల్పడుతున్న వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో వీటన్నింటికి చెక్ పెట్టబోతున్నారు బ్యాంకర్లు. ఇదిలా ఉంటే బ్యాంకర్ల సమావేశంలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్‌లు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎస్బీఐ తన కస్టమర్లకు విత్‌డ్రా లిమిట్ 20వేలకు తగ్గించగా.. 10వేలకు మించి విత్‌డ్రా చేసే వారికి ఓటీపీ కచ్చితం చేసేలా కెనరా బ్యాంకు భావించింది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..