అనంతలో దారుణం: కదులుతున్న రైల్లో నుంచి.. విద్యార్థిని తోసేశారు..!
అనంతపురం జిల్లా జక్కం చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న ట్రైన్‌లో నుంచి ఓ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు తోసేశారు. దీంతో ఆ స్టూడెంట్ కాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాడిపత్రికి చెందిన నిరంజన్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. విజయవాడ నుంచి ఇంటికి వెళ్లేందుకు ధర్మవరం వెళ్లే ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కాడు. కాస్త నిద్రపోవడంతో […]
అనంతపురం జిల్లా జక్కం చెరువు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న ట్రైన్‌లో నుంచి ఓ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు తోసేశారు. దీంతో ఆ స్టూడెంట్ కాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాడిపత్రికి చెందిన నిరంజన్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. విజయవాడ నుంచి ఇంటికి వెళ్లేందుకు ధర్మవరం వెళ్లే ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కాడు. కాస్త నిద్రపోవడంతో తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో నిరంజన్ రెడ్డి రైలు దిగలేకపోయాడు. దీంతో జక్కలచెరువు స్టేషన్‌లో రైలు నెమ్మదిగా వెళ్తే దిగుదామని డోర్ దగ్గర నిలబడ్డాడు. ఇంతలో వెనుకవైపు నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కిందికి తోసేశారు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి కింద పడటంతో నిరంజన్ రెండుకాళ్లు విరిగిపోయాయి.