AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మక ద్రోహం.. దుబాయ్‌లో వ్యభిచార గృహానికి అమ్మేసిన దుర్మార్గులు

పేదరికం వారికి శాపమైంది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడటం మోసగాళ్లకు వరంగా మారింది. మాయమాటలు చెప్పి దుబాయ్‌లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి ఏకంగా వ్యభిచార గృహాలకు అమ్మేసిన దుర్మార్గుల దురాగతాలు మరోసారి వెలుగుచూశాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలకు దుబాయ్‌లో ఉద్యోగాలు ఉన్నాయని, అక్కడ పనిచేస్తే దాదాపు రూ. 30 వేల జీతం వస్తుందని ఆశపెట్టి తీసుకెళ్లారు. విజిటింగ్ వీసాలపై దుబాయ్ తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. ఎంతో నమ్మకంతో […]

నమ్మక ద్రోహం.. దుబాయ్‌లో వ్యభిచార గృహానికి అమ్మేసిన దుర్మార్గులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 26, 2019 | 3:59 PM

Share

పేదరికం వారికి శాపమైంది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడటం మోసగాళ్లకు వరంగా మారింది. మాయమాటలు చెప్పి దుబాయ్‌లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి ఏకంగా వ్యభిచార గృహాలకు అమ్మేసిన దుర్మార్గుల దురాగతాలు మరోసారి వెలుగుచూశాయి.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలకు దుబాయ్‌లో ఉద్యోగాలు ఉన్నాయని, అక్కడ పనిచేస్తే దాదాపు రూ. 30 వేల జీతం వస్తుందని ఆశపెట్టి తీసుకెళ్లారు. విజిటింగ్ వీసాలపై దుబాయ్ తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. ఎంతో నమ్మకంతో దుబాయ్ చేరుకున్న వీరికి అక్కడ ప్రత్యక్ష నరకం కనిపించడంతో ఖంగుతిన్నారు.

వ్యభిచారం చేయాలని తమను బలవంతం చేయడంతో తిరస్కరించిన వీరిని శారీరకంగా చిత్రవధ చేశారు. తెలుగు వారై ఉండి కూడా దుబాయ్‌ దేశంలో వీరికి  ఎన్నో కష్టాలకు గురిచేశారు.   దుబాయ్‌లో భాధలను అనుభవించడం కంటే ఇంటికి వెళ్లిపోవడం మంచిదని ఆలోచించి తెగించి వెనక్కి వచ్చేశారు. వచ్చీ రాగానే వీరు దుబాయ్‌లో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులపై నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నరసాపురంలో ప్రాంతంలో పలువురు యువతులకు గాలం వేసి గల్ఫ్ దేశాలకు పంపించే నకిలీ ఏజెంట్ చినబాబు, జ్యోతి అనే ఇద్దరు తమను నమ్మించి దుబాయ్‌కి  పంపించారని ఆ మహిళలు చెప్పారు. దీంతో చినబాబు,జ్యోతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు . అయితే మోసానికి పాల్పడిన చినబాబు, జ్యోతి అనే ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారిని వెదికే పనిలో ఉన్నారు పోలీసులు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..