AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు.. డబ్బు విషయంలో కూడా!

Horoscope Today (August 14, 2026): శుక్రవారం 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉండగా, వృషభ రాశి వారికి బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం తదితర అంశాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు.. డబ్బు విషయంలో కూడా!
Horoscope Today 14 August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (ఆగస్టు 14, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి ప్రయోజనాలు పొందుతారు. దాదాపు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. మిత్రులతో కలిసి సేవా కార్య క్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. కానీ, కొందరు సన్నిహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితం అన్ని విధాలా సామరస్యంగా సాగిపోతుంది. దీర్ఘ కాలిక ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ పెద్దల నుంచి ఆశిం చిన సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులు, సహచరులకు అండగా నిలబడతారు. సామాజికంగా అను కూలతలుం టాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ, కార్యకలాపాలు ముందుకు వెడతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. తలపెట్టిన వ్యక్తిగత పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబానికి అవసరమైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా సాగుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత కనిపిస్తుంది. కొందరు స్నేహితులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యో గులకు ఆశించిన సమాచారం అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కెరీర్ కి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ఉద్యో గంలో పనిభారం ఉంటుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పులకు కూడా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు రానివ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగంతో కొద్ది కాలం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలకు బాగుంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇతరత్రా కూడా రోజంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశా జనకంగానే ఉంటుంది. విలాసాల మీద బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవు తాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉత్సాహాన్నిచ్చే శుభ వార్త అందుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది కానీ, కొందరు సహచరులు వల్ల ఇబ్బందులు పడతారు. వ్యక్తిగత జీవితంలో చిన్నాచితకా సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయానికి లోటుండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవ హారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద కోపతాపాలు ప్రదర్శించకపోవడం మంచిది. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులను ప్రవేశ పెట్టి లాభాలు గడిస్తారు. ఇంటా బయటా కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కూడా మంచి కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో పురోగమిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

శ్రమాధిక్యత ఉన్నా వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సక్రమంగా, సకాలంలో నిర్వర్తిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు, మదుపు ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉంటాయి. కానీ, మిత్రుల వల్ల పక్కదోవ పట్టాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

Follow Us
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?