Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌లో అమ్మాయి ప‌రిచయం.. వీడియో కాల్ అంటూ ఆశ‌.. క‌క్కుర్తి ప‌డ్డారో అంతే సంగ‌తులు. పోలీసులు ఇదే చెబుతున్నారు

Online Fraud: ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకూ కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. టెక్నాల‌జీ పెరిగింద‌ని సంతోషించే లోపే దానివ‌ల్ల జ‌రుగుతోన్న మోసాలు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో ఆన్‌లైన్‌లో బ్లాక్ మెయిల్‌లు...

ఆన్‌లైన్‌లో అమ్మాయి ప‌రిచయం.. వీడియో కాల్ అంటూ ఆశ‌.. క‌క్కుర్తి ప‌డ్డారో అంతే సంగ‌తులు. పోలీసులు ఇదే చెబుతున్నారు
Online Frauds
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 10, 2021 | 7:44 PM

Online Fraud: ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకూ కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. టెక్నాల‌జీ పెరిగింద‌ని సంతోషించే లోపే దానివ‌ల్ల జ‌రుగుతోన్న మోసాలు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో ఆన్‌లైన్‌లో బ్లాక్ మెయిల్‌లు, హ‌నీ ట్రాప్‌లు బాగా పెరిగిపోతున్నాయి. న‌గ్న వీడియోల‌ను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్‌కు దిగుతోన్న ఉదాంతాలు అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తూనే ఉన్నాయి. ఓ వైపు పోలీసులు, మీడియా ఇలాంటి వాటికి దూరంగా ఉండండ‌ని చెబుతున్నా. కొంద‌రు మాత్రం క‌క్కుర్తి ప‌డి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సైబ‌రాబాద్ పోలీసులు ఇలాంటి మోసాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.

ప్ర‌జ‌ల‌కు విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్పేందుకు ఇటీవ‌ల హైద‌రాబాద్ పోలీసులు సినిమాల‌ను సైతం వాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆన్‌లైన్ వేదిక‌గా అమ్మాయి అంటూ ప‌రిచ‌యం చేసుకొని చేస్తోన్న మోసాల‌కు సంబంధించి అవ‌గాహ‌న కోసం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్‌ను చేశారు. ఈసారి పోలీసులు ఇందుకోసం జాతి ర‌త్నాలు సినిమాను ఉప‌యోగించుకున్నారు. ఇందులో రాహుల్ రామ‌కృష్ణ‌.. న‌వీన్ పొలిశెట్టితో మాట్లాడుతూ.. `మామ ఈ పిల్ల ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయ్యింది. వాట్సాప్‌లో వీడియో కాల్ మాట్లాడుకుందాం అంటుంది` అని అంటాడు. దానికి న‌వీన్ పొలిశెట్టి స్పందిస్తూ.. `వ‌ద్దు మామ‌.. జోగిపేట రాజేశ్ గాడు ఇట్ట‌నే బ‌ట్ట‌లు లేకుండా వీడియో కాల్ మాట్లాడిండు.. దాన్ని రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన డ‌బ్బులు గుంజిర్రు` అని చెబుతాడు. ఇలా రూపొందించిన మీమ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన పోలీసులు `ఇలాంటి వారితో.. త‌స్మాత్ జాగ్ర‌త‌`అంటూ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. హైద‌రాబాద్ పోలీసుల క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల‌నిపిస్తోంది క‌దూ..!

పోలీసులు చేసిన ట్వీట్‌..

Also Read: Over My Dead Body: నా మృతదేహం కూడా బీజేపీలో చేర‌దు.. అక్కర్లేదు వెళ్లిపొమ్మంటే.. వెళ్లిపోతాం.. కాంగ్రెస్ లో సమస్యలు అలాగే ఉన్నాయి..

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

ఏపీ ప్రజలకు అలెర్ట్.. రేపట్నుంచి బ్యాంకుల టైమింగ్స్ మార్పు.. ఎప్పటివరకు అంటే.!