TV9 Impact: ఏపీ మద్యం దుకాణాల్లో అక్రమాలు..టీవీ9 కథనాలతో మంత్రి ఆదేశాలు.. అధికారుల తనిఖీల్లో తేలుతున్న లెక్కలు

TV9 Impact: తీగ లాగితే డొంక కదులుతోంది. ఎక్సైజ్ సిబ్బంది చేతివాటం. మోసాలు ఒక్కొటిగా బయట పడుతున్నాయి. విశాఖపట్నం ఎక్సైజ్ సిబ్బంది నిర్వాకంపై జరుపుతున్న విచారణ అక్కడితో ఆగిపోలేదు..

TV9 Impact: ఏపీ మద్యం దుకాణాల్లో అక్రమాలు..టీవీ9 కథనాలతో మంత్రి ఆదేశాలు.. అధికారుల తనిఖీల్లో తేలుతున్న లెక్కలు
Tv9 Impact
Follow us
KVD Varma

|

Updated on: Jun 10, 2021 | 6:02 PM

TV9 Impact: తీగ లాగితే డొంక కదులుతోంది. ఎక్సైజ్ సిబ్బంది చేతివాటం. మోసాలు ఒక్కొటిగా బయట పడుతున్నాయి. విశాఖపట్నం ఎక్సైజ్ సిబ్బంది నిర్వాకంపై జరుపుతున్న విచారణ అక్కడితో ఆగిపోలేదు.. మిగిలిన జిల్లాల్లో ఎక్సైజ్ సిబ్బంది మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమ అమ్మకాలపై టీవీ9 వరుస కథనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. టీవీ9 కథనాలకు స్పందించిన మంత్రి నారాయణస్వామి విచారణకు ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ వైన్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. షాపులో ఉన్న స్టాక్.. కొద్దిరోజులుగా జరిగిన అమ్మకాలు లెక్కలు తీశారు అధికారులు.

గంగాధర నెల్లూరు ప్రభుత్వ మద్యం దుకాణంలో ఏడూ లక్షల రూపాయలు కాజేశారు సిబ్బంది. దుకాణం సూపర్ వైజర్ నారాయణ, సేల్స్ మెన్ లోకేష్, సాగర్ చేతివాటం ప్రదర్శించినట్టు గుర్తించారు. తమిళనాడు వ్యాపారులతో సిబ్బంది కుమ్మక్కయినట్టు నిర్ధారణ చేశారు. తమిళనాడుకు చేరవేస్తున్న 30 వేల రూపాయల విలువైన మద్యం సీజ్ చేశారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్దనుంచి ఆరు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఇక్కడ ఒక్కచోటే కాదు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్నట్టు అధికారులు గుర్తించారు. ఏపీలో ప్రభుత్వ ఎక్సైజ్ షాపుల్లో భారీగా మోసాలు జరుగుతున్నాయని టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేశారు ఎక్సైజ్ అధికారులు.

చిత్తూరులో ఉన్న 270కి పైగా మద్యం షాపుల్లో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ దుకాణాల్లో ఇల్లీగల్ బిజినెస్ జరుపుతున్న వైనం టీవీ9 కొద్దిరోజులుగా కథనాలు ప్రసారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల సోదాల్లో ఇది నిజం అని నిరూపితం అయింది. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిరూపాయలు వైన్ షాపుల్లో గోల్ మాల్ జరుగుతూ వస్తోందని అధికారులు గుర్తించారు.

చిత్తూరు జిల్లలో 15 కేసులు వెలుగులోకి వస్తే.. 6 కేసులు మాత్రమె నమోదు చేశారు. ప్రభుత్వ లెక్కల్లో లేకుండా దాదాపు 24 లక్షల రూపాయల మద్యం అమ్మాకాలు జరిగాయని అధికారులు నిర్ధారించారు. స్త్యవేడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో 60 లక్షల రూపాయల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయి. గంగాధర నేల్లోరులోని నర్సాపురం మద్యం షాపులో 2.15 లక్షల అక్రమాలు చోటుచేసుకున్నాయి. కాణిపాకం ప్రభుత్వ మద్యం షాపులో 8 లక్షల రూపాయల అక్రమ అమ్మకాలు జరిగాయి.

అయితే, ఇప్పుడు జరిగిన సోదాల్లో తేలిన అక్రమాలతో తమకు సంబంధం లేదని ఎక్సైజ్ సిబ్బంది తప్పించుకుంటూ.. తప్పంతా అవుట్ సోర్సింగ్ సిబ్బందిపైకి నెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోసారి టీవీ9 అక్రమాలపై తనదైన విధానంలో ప్రభుత్వాన్ని మేలుకొలిపింది. దీంతో నిత్యం ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో జరుగుతున్న అక్రమాల్లో చేతులు మారిపోతున్న కోట్లాదిరూపాయల సొమ్ము విషయం ప్రభుత్వానికి తెలిసివచ్చింది. ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపే అవకాశం చిక్కింది. టీవీ9 లో ప్రసారమైన రాష్ట్రవ్యాప్త ఎక్సైజ్ తనిఖీలపై కథనం ఇక్కడ మీరు చూడొచ్చు.

Also Read: CM Jagan : ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పయనం.. అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ.!

Pendurthi : విశాఖ జిల్లాలో బొగ్గు లారీ బీభత్సం.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి బైకులు, ఆటోలు, తోపుడుబండ్లు పైకి దూసుకెళ్లిన వైనం