Pendurthi : విశాఖ జిల్లాలో బొగ్గు లారీ బీభత్సం.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి బైకులు, ఆటోలు, తోపుడుబండ్లు పైకి దూసుకెళ్లిన వైనం

వేగంగా వచ్చి విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్థంభం పూర్తిగా ధ్వంసమైది. తీగలు తెగి పడటంతో..

Pendurthi : విశాఖ జిల్లాలో బొగ్గు లారీ బీభత్సం.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి  బైకులు, ఆటోలు, తోపుడుబండ్లు పైకి దూసుకెళ్లిన వైనం
Accident
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 10, 2021 | 9:36 AM

Lorry accident : విశాఖ జిల్లా పెందుర్తి జివిఎంసి పరిధిలో బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బి ఆర్ టి ఎస్ రోడ్డు లోని పాత ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వేగంగా వచ్చి విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్థంభం పూర్తిగా ధ్వంసమైది. తీగలు తెగి పడటంతో పక్కనే ఉన్న ఇంట్లో నుండి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ నిలిపి ఉన్న రెండు బైకులు, రెండు ఆటోలు, రెండు తోపుడు బళ్ళను ఢీ కొట్టడంతో బైకులు, ఒక ఆటో, తోపుడు బళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ హాని జరగలేదు. ఫలితంగా పెందుర్తి పరిధిలో చీకట్లు అలుముకున్నాయి. ఈ సంఘటన బుధవారం రాత్రి 11 గంటలు సమయంలో చోటు చేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం… AP 39 U 6246 నెంబరు గల టిప్పర్ లారీ బొగ్గు లోడుతో విశాఖ పోర్ట్ నుండి కొత్తవలస మండలం కంటకాపల్లి లో ఉన్న ఓ కంపెనీకి పెందుర్తి మీదుగా బయలుదేరింది. ఈ క్రమంలో వేగంగా వచ్చి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది.

విద్యుత్తు ఉపకేంద్రానికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసిన విద్యుత్తు శాఖ సిబ్బంది.. మరమ్మతులు చేపట్టారు. పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read also : Agriculture : ఏపీలో క్రాప్‌ ప్లానింగ్, ప్రత్యామ్నాయ పంట‌ల‌పై దృష్టి.. వైయస్‌ జయంతి రోజున కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, హబ్‌లు ప్రారంభం