Vijayasai reddy : ‘అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది.. టీడీపి తెలంగాణా అధ్యక్షుడు తెరాసలోకి జంప్ అట’ : విజయసాయి

విజ‌య‌సాయిరెడ్డి మళ్లీ ఇవాళ టీడీపీ మీద తన ఎద్దేవాల పరంపర షురూ చేశారు...

Vijayasai reddy : 'అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది.. టీడీపి తెలంగాణా అధ్యక్షుడు తెరాసలోకి జంప్ అట' : విజయసాయి
MP Vijayasaireddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 09, 2021 | 4:41 PM

Vijayasai reddy వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మళ్లీ ఇవాళ టీడీపీ మీద తన ఎద్దేవాల పరంపర షురూ చేశారు. అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోందంటూ సెటైర్లకు తెరతీశారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఆ పార్టీపై చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మే అనిపిస్తున్నాయ‌ంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. “అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది. టీడీపి తెలంగాణా అధ్యక్షుడు తెరాసలోకి జంప్ అట. ఇక్కడ కూడా అలాంటి గందరగోళమే ఉంది. జూమ్ మీటింగులతో పిచ్చెక్కి పోయిన నేతలు కఠిన నిర్ణయం తీసుకోకపోతే తమ ఫ్యూచర్ నాశనం అవుతుందని టెన్షన్ పడుతున్నారంట. అచ్చెన్నే నాయకత్వం వహిస్తాడా తిరుగుబాటుకు?” అంటూ టీడీపీ మీద అచ్చెన్నాయుడు సెంట్రిక్ గా విమర్శలు ఎక్కుపెట్టారు విజయసాయి.

ఇక మరొక ట్వీట్ లో “ఇంత దివాళాకోరు రాజకీయాలకు తెగబడ్డాడేంటి బాబు? చివరకు ఆనందయ్య వనమూలికల వైద్యాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నాడు. ఏ గుర్తింపుకు నోచుకోని దేశీయ వైద్యులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురండి. మీకు పేరు వస్తుంది. సమాజానికి మేలూ జరుగుతుంది.” అంటూ వైసీపీ ఎంపీ విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థ దేశానికి ఆదర్శంగా మారుతోందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల కోవలోనే అన్ని రాష్ట్రాలు గ్రామ పంచాయతీ స్థాయిలో 59 రకాల సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని విజ‌య‌సాయిరెడ్డి అంత‌కుముందు చేసిన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read also : Ramatheertham : జనవరి నాటికి రామతీర్థం కొండపై శ్రీరాముల వారి ఆలయం నిర్మిస్తాం : దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!