Gold Trader Sukesh Gupta : బంగారం వ్యాపారి సుఖేష్‌ గుప్తాకు షాక్.. ఈడీ సమన్లపై స్టే ఇవ్వాలేమన్న హైకోర్టు

బంగారం వ్యాపారి సుఖేష్‌ గుప్తా పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ - ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఆ నోటీసులను సవాల్‌చేస్తూ హైకోర్టుకు..

Gold Trader Sukesh Gupta : బంగారం వ్యాపారి సుఖేష్‌ గుప్తాకు షాక్.. ఈడీ సమన్లపై స్టే ఇవ్వాలేమన్న హైకోర్టు
Follow us

|

Updated on: Jan 12, 2021 | 8:21 AM

Gold Trader Sukesh Gupta : బంగారం వ్యాపారి సుఖేష్‌ గుప్తా పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ – ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఆ నోటీసులను సవాల్‌చేస్తూ హైకోర్టుకు వెళ్లారు సుఖేష్‌గుప్తా. సమన్లపై స్టే ఇవ్వాలని కోరారు. లేదంటే అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయకుండా రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రజల ఆస్తుల స్వాహా జరిగిందనే ఆరోపణలతో మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు చేయకుండా తప్పుడు కేసులు పెట్టారని సుఖేశ్ గుప్తా తరపు న్యాయవాది ముఖుల్‌‌‌‌‌‌‌‌ రోహత్గి – హైకోర్టులో వాదించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 48 కోట్ల రూపాయలతో ప్యాలెస్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు వ్యవహారం రెండు పార్టీల వివాదమని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడంతోనే ప్యాలెస్‌‌‌‌‌‌‌‌ను రాయించుకున్నారని, అందులో తప్పులేదని కోర్టుకు తెలిపారు. అలాగే – ముంబైకి చెందిన నీహారిక ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫిర్యాదులో మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌ కేసు చెల్లుబాటు కాదన్నారు పిటీషనర్ తరపు న్యాయవాది ముఖుల్‌‌‌‌‌‌‌‌ రోహత్గి.

మరోవైపు – సుఖేష్‌గుప్తాపై ముంబైలో కేసు నమోందైందని కోర్టుకు తెలిపింది ఈడీ. హైదరాబాద్‌లో నమోదు చేసిన కేసును కూడా ముంబైకి బదిలీ చేస్తామని తెలిపింది. కింగ్‌‌‌‌‌‌‌‌ కోఠిలోని నస్రీబాగ్‌‌‌‌‌‌‌‌ ప్యాలెస్‌‌‌‌‌‌‌‌ను తప్పుడు పత్రాలతో సుఖేశ్ గుప్తా అమ్మేశారని ఈడీ పేర్కొంది. దీనిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తమ ఆఫీసు సుఖేశ్ గుప్తాకు నోటీసు ఇచ్చిందని వెల్లడించింది.

ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు చెప్పింది. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వలేమంటూ సుఖేష్‌ గుప్తా పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్‌ హిమా కోహ్లీ ఇచ్చిన తొలి తీర్పు ఇది.

ఇవి కూడా చదవండి :

Lamba Investigation : ఆన్‌లైన్ లోన్ యాప్ మనీ దందా వెనుక ఓ మహిళ.. తీగ లాగుతున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు

ఒక్కప్పుడు అవి వస్తే గ్రామాల్లో పండుగ.. ఇప్పుడు వస్తున్నాయంటేనే అక్కడివారిలో వణుకు

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..