Crime News: కూల్‌డ్రింక్ అనుకుని విషం తాగిన చిన్నారులు.. అంతకుముందే తండ్రి ఆత్మహత్య.. ఆ గ్యాప్‌లో ఏం జరిగింది..
ఓ వ్యక్తి అప్పుల బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడు కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగాడు. తాగిన వాడు పూర్తిగా తాగలేదు...
ఓ వ్యక్తి అప్పుల బాధతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడు కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగాడు. తాగిన వాడు పూర్తిగా తాగలేదు. మిగిలి దాన్ని అతడి పిల్లలు కూల్‌డ్రింక్ అనుకుని తాగేశారు. తండ్రితోపాటు కుమారుడు మృతి చెందాడు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
శ్రీకాకుళం జిల్లా కొరసవాడకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి.. కార్పెంటర్‌గా పనిచేస్తుండేవాడు. చాలీచాలని కూలీతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీంతో అతడు అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులైతే చేశాడు కానీ వాటిని ఎలా తీర్చాలో తెలియలేదు. అప్పు ఇచ్చిన వారు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావటంతో వెంకటరమణ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు తెచ్చుకుని దానిని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగాడు. కొంతసేపటి తర్వాత కింద పిడిపోయాడు గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇంటి వద్దే ఉన్న కుమార్తె, కుమారుడు నాన్న తాగింది కూల్‌డ్రింక్ అనుకొని తాగేశారు.
చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి మెరుగుపడంది. పిల్లలను వైద్యులు ఇంటింకి పంపారు. పిల్లలైనా బతికి ఉన్నారు. అనుకునే సమయంలోనే.. ఇద్దరికీ వాంతులు కావడం మెుదలైంది. వెంటనే విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కుమారుడు నిహాల్ చనిపోయాడు. కుమార్తె యామిని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
Read Also.. Imprisonment To Teacher: పెన్ విసిరిన టీచర్.. చూపు కోల్పోయిన విద్యార్థి.. తర్వాత..