AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భూతవైద్యుడి రాసలీలలు.. ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్లుగా అక్కాచెల్లిళ్లపై అత్యాచారం..

మూడనమ్మకాల పేరుతో మాయల మాంత్రికుల చేతిలో పాతబస్తీకి చెందిన ఎందరో మగువలు బలవుతున్నారు. మంత్రాల నెపంతో...

Crime News: భూతవైద్యుడి రాసలీలలు.. ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్లుగా అక్కాచెల్లిళ్లపై అత్యాచారం..
Fake Baba
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 27, 2021 | 12:19 PM

Share

డేరాబాబాను మించిన దుర్మార్గులు. ఎక్కడో కాదు.. హైదరాబాద్‌ పాతబస్తీలో. తల్లి వైద్యం కోసం వెళ్లి కూతుళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు తండ్రీ కొడుకులు. వారి అరాచకాలను అలస్యంగా గుర్తించిన అక్కా చెల్లెళ్లు తల్లితో కలిసి ఆ తండ్రీ కొడుకులపై చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ తండ్రీకొడుకులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో దక్షిణమండలం డిసిపి గజరావు భూపాల్​, ఫలక్​నుమా ఏసీపీ మాజిద్​, చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ కె ఆన్​ ప్రసాద్​ వర్మ, డిటెక్టివ్​ ఇన్ స్పెక్టర్​ వీరయ్యలు వివరాలను వెల్లడించారు.

చంచల్​గూడ రహమతియా స్కూల్​కు చెందిన సయ్యద్​ హసన్​ అస్కరి(52) చెప్పుల వ్యాపారంతో పాటు భూతవైద్యం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య పిల్లలు మలక్​పేట్​లో నివాసముంటుండగా రెండవ భార్య పిల్లలు రెయిన్​బజార్​లో నివసిస్తున్నారు. పెద్ద భార్య కుమారుడు ఓల్డ్​మలక్​పేట్​ వాహెద్​నగర్​ చెందిన సయ్యద్​ అఫ్రోస్(23) రైతుబజార్​లో పనిచేస్తుంటాడు. భూతవైద్యంలో తండ్రికి సహాయం చేసేవాడు. కిషన్​బాగ్​కు చెందిన మహిళకు ఆరోగ్యం క్షీణించడంతో అతని సోదరుడు 2005లో సయ్యద్​ హసన్​ అస్కరి అనే భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పట్లో ఆమెకు వైద్యం పేరుతో ఆమె కుటుంబానికి దగ్గర అయ్యాడు. ఆ మహిళకు ఇద్దరు కూతుళ్ళు, కుమారుడు. పెద్దకుమార్తె (32), చిన్న కుమార్తె (23)లు ఉన్నారు. భూతవైద్యుడు సయ్యద్​ హసన్​ అస్కరి వైద్యంతోనే ఆమెకు ఆరోగ్యం నయమైనదని ఆ కుటుంబం విశ్వసించసాగారు. ఈ నేపధ్యంలోనే అతను తరచూ వాళ్ల ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఆమె పెద్ద కూతురుపై కన్నేసిన భూతవైద్యుడు ఆమెకు మాయమాటలతో బురడీ కొట్టించసాగాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించసాగాడు. 2015లో ఆమెకు మరో యువకుడితో పెళ్ళైన విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన భూతవైద్యుడు ఎలాగైనా విడగొట్టాలని కుట్రలు కుతంత్రాలకు పాల్పడ్డాడు. నీ మొగుడి కారణంగానే నీ ఆరోగ్యం దెబ్బతిన్నదని మాయమాటలతో నమ్మించాడు. చివరకు 2016లో ఆమె భర్తకు విడాకులు ఇప్పించాడు.

కిషన్​బాగ్​లో ఉన్న ఇంటిని విక్రయించగా వచ్చిన కొంత డబ్బును కూడా ఈ భూత వైద్యుడు వాడుకున్నాడు. అక్కా చెల్లెళ్లను కిషన్​బాగ్​ నుంచి బండ్లగూడ తులసీనగర్​లో అద్దె ఇంటికి మకాం మార్పించాడు. అప్పటి నుంచి అక్కా చెల్లెళ్లను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఇద్దరిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. భూత వైద్యుడు సయ్యద్​ హసన్​తో పాటు అస్కరి కుమారుడు సయ్యద్​ అఫ్రోస్​ కూడా అక్కపై అత్యాచారం చేయసాగాడు. అతని మాయమాటలలో పడ్డ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇల్లు అమ్మగా తీసుకున్న డబ్బులు ఇవ్వమని ఎన్ని సార్లు అడిగినా సయ్యద్​ హసన్​ అస్కరి డబ్బులు ఇవ్వలేదు. దీంతో తమను మాయమాటలతో మోసగించాడని ఆలస్యంగా గ్రహించిన అక్కా చెల్లెల్లు జరిగిన విషయం అంతా తల్లికి చెప్పారు. ముగ్గురు కలిసి తండ్రి సయ్యద్​ హసన్​ అస్కరి, కొడుకు సయ్యద్​ అఫ్రోస్​ల అరాచకాలపై చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసంతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రికొడుకులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి భూతం వైద్యంకు సంబంధించిన సామాగ్రి మూడు తాయత్తులు, జీడిగింజలు, సాంబ్రాని పొడి తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

(టీవీ9 రిపోర్టర్ నూర్ మహమ్మద్, హైదరాబాద్)

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?