Online Rummy Game: విషాదం.. ఆన్‌లైన్ రమ్మీకి నిండు ప్రాణం బలి.. అప్పులు భరించలేక ఆత్మహత్య
Crime News: ఆన్‌లైన్ గేమ్స్ వల్ల ఇప్పటివరకు చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. అయినా కూడా యువతలో మార్పు కనిపించడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే
Crime News: ఆన్‌లైన్ గేమ్స్ వల్ల ఇప్పటివరకు చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. అయినా కూడా యువతలో మార్పు కనిపించడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్నీ మరిచిపోయి ఆన్‌లైన్‌లో మునిగితేలుతున్నారు. నిద్రహారాలు మాని గేమ్స్ ఆడుతూ ప్రాణాలు డబ్బులు పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో ఉన్నత చదువులు చదివిన ఓ ఇంజనీర్ ఆన్‌లైన్ రమ్మీకి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపత్తూరు జిల్లా కాటుకొల్లై గ్రామానికి చెందిన ఆనందన్ చెన్నైలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మిత్రుల మాటలను నమ్మి ఆన్‌లైన్ ద్వారా సెల్‌ఫోన్‌లో రమ్మీకి బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా రమ్మీ ఆడేవాడు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల కోసం చెన్నై నుంచి ఇంటికి వచ్చిన ఆనందన్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆనందన్ ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ.10 లక్షల నగదు పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఫ్రెండ్స్ దగ్గర రూ.6 లక్షలు అప్పు చేశాడు. ఈ డబ్బులు ఏ విధంగా చెల్లించాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఆనందన్ రూం నుంచి బయటకు రాక పోవడంతో కుటుంబ సభ్యులు కిటికీల ద్వారా చూడా ఆనందన్ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్స్‌కి యువత ఎంతగా ప్రభావితమవుతున్నారంటే కేరళలో ఆన్‌లైన్ గేమ్స్ అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మద్యం, ధూమపానం.. ఈ రెండింటికే డి-అడిక్షన్ సెంటర్లు నిర్వహిస్తారని వింటూ వచ్చాం. కానీ కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసవుతున్న వారికోసం ఈ సెంటర్లను నిర్వహిస్తోంది. అంటే పరిస్థితి ఎంతలా చేజారిందో అర్థం చేసుకోవచ్చు.