Smartphone: స్మార్ట్‌ఫోన్‌ దారులకు హెచ్చరిక..! ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Smartphone: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఎవ్వరూ ఉండలేరు. ఒకపూట అన్నం లేకున్నా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్‌ లేకుండా ఉండలేరు

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ దారులకు హెచ్చరిక..! ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Smartphone
Follow us
uppula Raju

|

Updated on: Oct 11, 2021 | 11:24 AM

Smartphone: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఎవ్వరూ ఉండలేరు. ఒకపూట అన్నం లేకున్నా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్‌ లేకుండా ఉండలేరు. కాల్ చేయడం, మెయిల్ పంపడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, డిజిటల్ పేమెంట్స్‌, మొదలైన పనులన్ని స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే చేస్తాం. దీంతో ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే స్మార్ట్‌ ఫోన్ వేడెక్కి ఒక్కోసారి పేలిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్ కమ్యూనికేషన్ యూనిట్, కెమెరా కూడా వేడవుతున్నాయి. అయితే ఇది బ్యాటరీతో పోల్చితే చాలా తక్కువ. ఫోన్‌ వేడవుతుందని అంటే దాని పనితీరు కుంటుపడుతుందని అర్థం. ఫోన్‌లో అధిక అప్లికేషన్‌లు, గేమ్‌లు లేదా ఇతర సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.

1. స్మార్ట్‌ఫోన్‌ని ఫుల్‌గా ఛార్జ్ చేయవద్దు ఎప్పుడైనా కానీ స్మార్ట్‌ఫోన్‌ని ఫుల్‌గా ఛార్జ్ చేయవద్దు. 90 శాతం లేదా అంతకంటే తక్కువగా ఛార్జ్‌ చేస్తే మంచిది. అలాగే ఫోన్ బ్యాటరీ 20 శాతం కంటే తక్కువగా ఉండనివ్వవద్దు. ఫోన్‌ చాలా సమయం ఛార్జ్ చేయడం వల్ల వేడెక్కుతుంది అలాగే చాలా తక్కువ పవర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు మీ ఫోన్‌ను రోజుకు 2-3 సార్లు ఛార్జ్ చేయవచ్చు.

2. ఫోన్ కవర్ ఉపయోగించడం స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి మొబైల్ కవర్‌లు కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఇవి వేడిని ఫోన్‌ లోపలి నుంచి బయటికి వెళ్లనివ్వవు. ఫోన్‌ కవర్‌ని ఎప్పటికప్పుడు తీసివేయడం అవసరం. ఉపయోగంలో లేనట్లయితే స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాన్ కింద ఉంచడం మంచిది.

3. ఉపయోగించని యాప్‌లు స్మార్ట్‌ ఫోన్‌లో ఉపయోగించని యాప్‌ల వల్ల కూడా ఫోన్‌ వేడెక్కుతుంది. ఈ యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూనే ఉంటాయి దీనివల్ల ఫోన్ వేడెక్కుతుంది. మీరు ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయడానికి యాప్ ఐకాన్‌పై ఫోర్స్ స్టాప్ ఎంచుకోండి. వాటిని రోజూ కాకుండా అప్పుడప్పుడు ఉపయోగించేలా చూడండి.

4. ఫోన్ సెట్టింగ్‌లను మార్చండి మీ స్క్రీన్ వెలుగును వీలైనంత వరకు తగ్గించండి ఎందుకంటే ఇది డిస్‌ప్లేని చూడటం కష్టతరం చేస్తుంది. వెలుగును తగ్గించడం వల్ల బ్యాటరీపై కూడా ఎఫెక్ట్ పడదు. తద్వారా ఫోన్‌ తక్కువ వేడిగా ఉంటుంది.

5. ఒరిజినల్ ఛార్జర్, USB కొంతమంది ఛార్జర్, యుఎస్‌బి విరిగిపోయిన తర్వాత లేదా పాడైపోయిన తర్వాత వాడుతారు. ఇది చాలా తప్పు. డూప్లికేట్ ఛార్జర్ లేదా యుఎస్‌బి నుంచి ఛార్జ్‌ చేయడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్‌ ఆయుష్షు తగ్గుతుంది. అంతేగాక విపరీతంగా వేడెక్కుతుంది. అంతేకాదు ఒక్కోసారి బ్యాటరీ దెబ్బతిని పేలే ప్రమాదం కూడా ఉంది.

MAA Elections 2021: ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా..