Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్ రివర్స్..
Insurance Money: సులువుగా సంపాదించాలని.. పలు సంస్థల్లో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. అనంతరం కోట్ల రూపాయలు సంపాదించవచ్చే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా ట్రైన్
Insurance Money: సులువుగా సంపాదించాలని.. పలు సంస్థల్లో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. అనంతరం కోట్ల రూపాయలు సంపాదించవచ్చే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. చివరకు.. రెండు కాళ్లు పోగొట్టుకున్న ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ కంపెనీలు షాకిచ్చాయి. ఏడేళ్ల క్రితం హంగేరీలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హంగేరీకి చెందిన 54 ఏళ్ల సెందర్ అనే వ్యక్తి పలు బీమా సంస్థల నుంచి సుమారు 14 ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. అయితే.. ఏళ్లు గడుస్తున్నా తన బీమా తాలూకు రూ. 23 కోట్ల డబ్బు పొందలేకపోతున్నాననే బాధతో ట్రైన్ కింద రెండు కాళ్లు పెట్టి పోగొట్టుకున్నాడు. అనంతరం తనకు ఇన్సురెన్స్ కింద లభించే 23 కోట్ల 97 లక్షల కోసం బీమా సంస్థలకు దరఖాస్తు చేసుకున్నాడు. అతనిపై అనుమానం రావడంతో బీమా కంపెనీలు క్లెయిమ్ ను ఆలస్యం చేశాయి. దీంతో అతను కోర్టుకు వెళ్లగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ షాకింగ్ సంఘటన 2014లో జరిగింది. ప్రస్తుతం సెందర్ కృత్రిమ అవయవాలను వాడుతూ వీల్‌చైర్ సపోర్టుతో బతుకీడుస్తున్నాడు.
బీమా కంపెనీలు తనకు వచ్చే క్లెయిమ్‌ను ఆలస్యం చేస్తున్నాయని.. సెందర్ కోర్టును ఆశ్రయించాడు. అనంతరం కోర్టు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీమా పాలసీలపై వచ్చే రాబడులు మెరుగ్గా ఉంటాయని అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెందర్ కోర్టులో ఒప్పుకున్నాడు. దీనికోసం.. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయానని.. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు తెగిపోయాయని తెలిపాడు. ఇదంతా బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్ వేసినట్లు కోర్టులో తెలిపాడు. అతను ఉద్దేశపూర్వకంగా బీమా డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నట్లు ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో.. ఈ కేసును కొట్టివేశారు. బీమా కంపెనీలను మోసం చేయాలని అతను తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎవరైనా ఇలా చేస్తారా అంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: