AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool District: పాస్టర్ కాదు పర్వర్ట్.. ప్రేయర్ పేరుతో మైనర్ బాలికలపై…

కర్నూలు జిల్లాలో పాస్టర్‌ అరాచకాలపై టీవీ9లో ప్రసారమైన కథనాలపై పోలీసులు స్పందించారు. పాస్టర్ ప్రసన్న కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

Kurnool District: పాస్టర్ కాదు పర్వర్ట్.. ప్రేయర్ పేరుతో మైనర్ బాలికలపై...
Pervert Pastor
Ram Naramaneni
|

Updated on: Nov 13, 2021 | 11:30 AM

Share

కర్నూలు జిల్లాలో పాస్టర్‌ అరాచకాలపై టీవీ9లో ప్రసారమైన కథనాలపై పోలీసులు స్పందించారు. పాస్టర్ ప్రసన్న కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు చాగలమర్రి పోలీసులు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్ ను విచారిస్తున్నట్టు వెల్లడించారు. పాస్టర్ పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు.

కర్నూలు జిల్లా శెట్టివీడులో పాస్టర్ ప్రసన్నకుమార్‌‌ లైంగిక వేధింపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రేయర్‌ పేరుతో మైనర్‌ బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల పేరెంట్స్‌. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపి సెటిల్మెంట్‌ చేసుకున్న విషయం బయటకి రావడంతో పోలీసులు స్పందించారు. బాధితులకు 50 వేలు, పంచాయితీ పెద్దలకు 10 వేలు, పోలీసులకు 5 వేలు ఇచ్చి సెటిల్మెంట్‌ చేసుకున్న విషయం బయటపడింది.

పాస్టర్‌ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, బాధిత మైనర్‌ బాలికలు బయటపెట్టారు. తమ పేరెంట్స్‌కి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. పాస్టర్‌ చాలా మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితులు తెలిపారు. పాస్టర్‌ అరాచకాలపై టీవీ9లో కథనాలు ప్రసారం కావడంతో పోలీసులు స్పందించారు. పాస్టర్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.

Also Read: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు.