Child Death Mystery: తెల్లవారే సరికల్లా అచేతనంగా పడి ఉన్న కుటుంబసభ్యులు.. అసలేం జరిగింది?
ఇంట్లో లక్ష్మి, సంధ్య అపస్మానిక స్థితిలో ఉన్నారు. వాళ్లల్లో భవాని అనే ఎనిమిది ఏళ్ల బాలిక అప్పటికే మృతి చెందింది. మిగిలిన ముగ్గురినీ గ్రామస్తులు వైద్యం కోసం మండలంలోని పాతర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కి లక్ష్మీ, సంధ్యా, రాజులను తరలించారు వైద్యులు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలేంలో భవాని అనే ఎనిమిదేళ్ళ బాలిక మృతి మిస్టరీగానే ఉంది. ఆచరణలో బాలిక మృతి చెందగా మృతురాలు అమ్మమ్మ లక్ష్మి, తల్లి సంధ్య, సోదరుడు రాజు అచేతనంగా ఇంట్లోనే పడి ఉండటం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు వారికి ఏమైంది అనేది ఎవరికి అంతుపట్టటం లేదు. తొలుత మూకుమ్మడిగా ఆత్మహత్యలకు ప్రయత్నించారని పుకారులు రాగా, పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
జీరుపాలెం గ్రామంలో చీకోటి నాగరాజు కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. తెల్లవారగానే నాగరాజు చేపల వేటకు వెళ్లిపోయాడు. నాగరాజు వేటకు వెళ్లిన కాసేపటికే ఇంట్లో ఉన్న అతని అత్త లక్ష్మీ, భార్య సంధ్య, కుమారుడు రాజు ఇంట్లో అచేతనoగా పడి ఉన్నారు. ఉదయం 8:30 అవుతున్న కుటుంబ సభ్యులు తలుపులు తీయకపోవటంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి తలుపులు కొట్టగా… అపస్మానిక స్థితిలో ఉన్న రాజు కొద్దిపాటి మెలకువతో అతి కష్టం మీద తలుపులు తీశాడు. వెంటనే ఇంట్లోని పరిస్థితిని చూసిన ఇరుగుపొరుగువారు షాక్ అయ్యారు.
ఇంట్లో లక్ష్మి, సంధ్య అపస్మానిక స్థితిలో ఉన్నారు. వాళ్లల్లో భవాని అనే ఎనిమిది ఏళ్ల బాలిక అప్పటికే మృతి చెందింది. మిగిలిన ముగ్గురినీ గ్రామస్తులు వైద్యం కోసం మండలంలోని పాతర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కి లక్ష్మీ, సంధ్యా, రాజులను తరలించారు వైద్యులు.
అయితే అదే రోజు సాయంత్రానికి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ ఇప్పటికీ అసలు ఏం జరిగింది అనేదానిపై స్పష్టత రావటంలేదు. బాలిక మృతికి కారణం ఏంటి? మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు ఎందుకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు అనేదానిపై బాధిత కుటుంబం ఏమీ చెప్పలేకపోతోంది. మరోవైపు దర్యాప్తు చేపడుతున్న పోలీసుల నుండి సైతం ఇంకా విచారణ కొనసాగుతుంది. జయపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఘటన జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపారు.
అయితే బాలిక మృతికి మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్ళటానికి విష వాయువులు పీల్చడమే కారణమని అనుకుంటున్నారు. ఇంట్లో బొగ్గులు పొయ్యిపై నుండి పొగలు రావటాన్ని చూసిన పోలిసులు. పొగను పీల్చటం వల్ల కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడానికి అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




