Crime News: బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం.. సిబ్బందితో కలిసి ఏటీఎంలోని రూ.10 లక్షల చోరీ..

బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బ్యాంక్‌ ఏటీఎంనే కొల్లగొట్టాడు

Crime News: బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం.. సిబ్బందితో కలిసి ఏటీఎంలోని రూ.10 లక్షల చోరీ..
Follow us

|

Updated on: Nov 05, 2021 | 1:19 PM

బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. తనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బ్యాంక్‌ ఏటీఎంనే కొల్లగొట్టాడు. తన సిబ్బంది సహాయంతో రూ.10లక్షలకు పైగా సొమ్ము కాజేశాడు. అయితే నగదు నిల్వలకు సంబంధించి బ్యాంక్‌ రికార్డుల్లో తేడా రావడంతో చేసి పోలీసులకు దొరికిపోయాడు. గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదర జిల్లాలోని వాఘోడియా పట్టణంలో ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు బ్యాంక్‌ మేనేజర్‌తో మరో ముగ్గురు బ్యాంక్‌ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

రికార్డుల్లో తేడా రావడంతో.. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ వాఘోడియా బ్రాంచ్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోన్న హేమంత్‌ కుమార్‌ మీనా, అదే బ్యాంక్‌లో ప్యూన్‌గా పనిచేస్తోన్న శైలేష్‌ శర్మ, వినూ, శుభం సింగ్‌ అనే మరో ఇద్దరు ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఈ కేసును విచారించిన పోలీస్‌ అధికారి దేశాయ్‌ మాట్లాడుతూ ‘ ఏటీఎం మెషిన్‌లో సరిపడా నగదు నిల్వలు ఉన్నట్లు బ్యాంకు రికార్డులు చెబుతున్నాయి.. కానీ ఏటీఎంలో మాత్రం నగదు చూపించడం లేదు. ఏటీఎంను ఎవరూ బలవంతంగా తెరచినట్లు ఆధారాలు కూడా కనిపించలేదు. మెషిన్‌లోని క్యాష్‌ వాల్ట్‌ పాస్‌వర్డ్‌ తెలిసిన వారు మాత్రమే ఈ చోరీకి పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆతర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేస్తే బ్యాంక్‌ మేనేజర్‌ తన సిబ్బందితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. సాధారణంగా ఏటీఎం మెషిన్‌లోని క్యాష్‌ వాల్ట్‌ కీ, పాస్‌వర్డ్‌ ఆ సంబంధిత బ్రాంచ్‌ మేనేజర్‌ దగ్గర మాత్రమే ఉంటాయి. మొదట ఆ కోణంలోనే విచారణ ప్రారంభించాం. ఇతనికి ప్యూన్‌తో పాటు బ్యాంక్‌లో పనిచేస్తోన్న ఇద్దరు సాంకేతిక సిబ్బంది కూడా సహకరించారు. వీరిపై కేసులు నమోదుచేశాం

Also Read:

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..

Crime News: భర్తమీద కోపం బిడ్డలపై చూపించింది.. ఐదుగురి పిల్లల్ని కర్కశంగా హతమార్చిన తల్లికి జీవిత ఖైదు..

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..