ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్‌ చాంద్రాయణ గుట్ట బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో జరిగింది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ఏటీఎంల వద్దకు వచ్చిన దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంల నుంచి ఒకేసారి మంటలు రావడంతో.. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి మంటలను అదుపు చేసినా ఫలితం లేదు. ఏటీఎంలు మొత్తం కాలిపోయాయి. ముందు షార్ట్ సర్య్కూట్ అని […]

ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 11, 2020 | 2:20 PM

ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్‌ చాంద్రాయణ గుట్ట బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో జరిగింది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ఏటీఎంల వద్దకు వచ్చిన దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంల నుంచి ఒకేసారి మంటలు రావడంతో.. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి మంటలను అదుపు చేసినా ఫలితం లేదు. ఏటీఎంలు మొత్తం కాలిపోయాయి.

ముందు షార్ట్ సర్య్కూట్ అని భావించినా.. అక్కడి పరిస్థితులను బట్టి ఎవరో ఏటీఎంలోని డబ్బులను దోచుకోవడానికి యత్నించినట్టు పోలీసులు గుర్తించారు. కాగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా చేయగా.. కొందరు యువకులు ముఠాగా వచ్చి ముందుగా ఏటీఎంలను తెరిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని, ఎంతకీ తెరుచుకోకపోయేసరికి పెట్రోల్ పోసి ఏటీఎంలను తగలబెట్టారని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నారు.