శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు… కత్తి మహేశ్‌పై కేసు నమోదు

హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్‌పై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.  రాములవారిపై, సీతమ్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది కరుణసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేవలం నాంపల్లిలోనే కాకుండా రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో కత్తి మహేశ్‌పై ఫిర్యాదులు అందాయి. హిందువులు కించపరిచేలా అతడు ప్రవర్తిస్తున్నారని..సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా పలువురు నెటిజన్లు కంప్లైంట్ ఇచ్చారు. రాముడికి ఇష్టమైన […]

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు... కత్తి మహేశ్‌పై కేసు నమోదు
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 11, 2020 | 2:44 PM

హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్‌పై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.  రాములవారిపై, సీతమ్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది కరుణసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేవలం నాంపల్లిలోనే కాకుండా రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో కత్తి మహేశ్‌పై ఫిర్యాదులు అందాయి. హిందువులు కించపరిచేలా అతడు ప్రవర్తిస్తున్నారని..సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా పలువురు నెటిజన్లు కంప్లైంట్ ఇచ్చారు.

రాముడికి ఇష్టమైన వంటకం  జింక మాంసం, నెమలి తొడ అని.. సీత, రాముడిని బంగారు జింకను తెమ్మన్నది తినడానికే అని కత్తి మహేశ్ ఇటీవల వ్యాఖ్యానించడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఇంతేకాదు రాముడి క్యారెక్టర్‌పై కూడా అతడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాముడిని ఆరాధించే కొట్లాదిమందితో పాటు పలు హిందూ సంఘాలు సైతం కత్తి మహేశ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. గతంలో కూడా కత్తి మహేశ్ రాముడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయండంతో..హైదరాబాద్ నుంచి అతడిని 6 నెలల పాటు బహిష్కరించారు.