కోట్లాది పాన్ కార్డులకు త్వరలో మంగళం?

పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి గతంలో ఎనిమిది సార్లు ఆదాయపు పన్ను శాఖ గడువు పొడిగించినప్పటికీ, 17 కోట్లకు పైగా పాన్ కార్డ్ హోల్డర్లు ఇంకా రెండు పత్రాలను లింక్ చేయలేదు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ కార్డులు చెల్లబోవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించనుంది. ఇలా లింక్ చేయని పాన్ కార్డులు ప్రస్తుతం 17 కోట్లకు పైనే ఉన్నట్లు అంచనా. దేశం మొత్తం మీద ఇప్పటివరకు జారీ […]

కోట్లాది పాన్ కార్డులకు త్వరలో మంగళం?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 10, 2020 | 10:53 PM

పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి గతంలో ఎనిమిది సార్లు ఆదాయపు పన్ను శాఖ గడువు పొడిగించినప్పటికీ, 17 కోట్లకు పైగా పాన్ కార్డ్ హోల్డర్లు ఇంకా రెండు పత్రాలను లింక్ చేయలేదు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ కార్డులు చెల్లబోవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించనుంది. ఇలా లింక్ చేయని పాన్ కార్డులు ప్రస్తుతం 17 కోట్లకు పైనే ఉన్నట్లు అంచనా. దేశం మొత్తం మీద ఇప్పటివరకు జారీ అయిన పాన్ కార్డులు 48 కోట్లకు పైగానే. వీటిలో 17 కోట్లకు పైనే పాన్ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదు.

“ఒక వ్యక్తి ఆధార్ నంబర్‌ను తెలియజేయడంలో విఫలమైతే, అటువంటి వ్యక్తికి కేటాయించిన శాశ్వత ఖాతా సంఖ్య నోటిఫైడ్ తేదీ తర్వాత నిబంధనల ప్రకారం పనిచేయదు” అని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA లోని 41 వ నిబంధన తెలియజేస్తుంది. ఈ సవరణ 1 సెప్టెంబర్, 2019 నుండి అమల్లోకి వచ్చింది. ఆధార్‌తో అనుసంధానించబడితే తప్ప అలాంటి అన్ని పనిచేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారతాయని స్పష్టంగా తెలుస్తుంది. మొన్న జనవరి వరకు 30.75 లక్షల పాన్ కార్డులను ఆధార్ నెంబర్‌తో లింక్ చేశారని, ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17.58 కోట్ల వరకూ ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభకు వెల్లడించిన విషయం తెలిసిందే.

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే