కరీంనగర్ వాసులకు శుభవార్త.. ఈ నెల 18న ఐటీ టవర్ ప్రారంభం!
హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు మూడు కారిడార్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన ఎల్ అండ్ టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మరో తీపి కబురును ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచన మేరకు ఎల్ అండ్ టి సంస్థ వరంగల్ నగరంలో ఈ సంస్థకు చెందిన మైండ్‌ట్రీ అనే సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతిస్తూ ప్రకటనను వెలువరించిందని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా.. త్వరలో కరీంనగర్ […]
హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు మూడు కారిడార్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన ఎల్ అండ్ టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మరో తీపి కబురును ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచన మేరకు ఎల్ అండ్ టి సంస్థ వరంగల్ నగరంలో ఈ సంస్థకు చెందిన మైండ్‌ట్రీ అనే సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సమ్మతిస్తూ ప్రకటనను వెలువరించిందని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్‌లో వెల్లడించారు.
కాగా.. త్వరలో కరీంనగర్ లో కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందనుంది. ‘కేసీఆర్ ఉండగా.. గల్ఫ్ బాట దండగా’ అన్న నినాదంతో ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కరీంనగర్‌లో ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు తుది దశకు చేరిన ఐటీ టవర్ నిర్మాణ పనులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.
కరీంనగర్ లో కార్యకలాపాలు ప్రారంభించే ఐటీ కంపెనీలకు ఆకర్షణీయమైన రాయితీలు ఇస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. కరీంనగర్ ఐటీ టవర్‌లో ఇప్పటికే 25 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. ఐటీ టవర్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వినోద్‌కుమార్ వెల్లడించారు.