కరోనా వైరస్‌‌కు మందు కనిపెడితే.. జాకీచాన్ బంపర్ ఆఫర్!

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ప్రపంచానికి నిద్రను దూరం చేసిన కరోనా వైరస్‌పై ప్రముఖ నటుడు జాకీచాన్ స్పందించాడు. ఈ మహమ్మారిని తరిమికొట్టే మందు కనిపెట్టినవారికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. కరోనా వైరస్‌కు మందును కనిపెట్టే సత్తా చాలామందిలో ఉందని, ఈ వైరస్‌కు మందు ఎవరు కనిపెట్టినా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు. కాగా, వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అది మరింత ప్రబలకుండా వుహాన్‌లో […]

కరోనా వైరస్‌‌కు మందు కనిపెడితే.. జాకీచాన్ బంపర్ ఆఫర్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 12, 2020 | 8:11 AM

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ప్రపంచానికి నిద్రను దూరం చేసిన కరోనా వైరస్‌పై ప్రముఖ నటుడు జాకీచాన్ స్పందించాడు. ఈ మహమ్మారిని తరిమికొట్టే మందు కనిపెట్టినవారికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. కరోనా వైరస్‌కు మందును కనిపెట్టే సత్తా చాలామందిలో ఉందని, ఈ వైరస్‌కు మందు ఎవరు కనిపెట్టినా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు. కాగా, వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అది మరింత ప్రబలకుండా వుహాన్‌లో జాకీచాన్ మాస్కులు, ఇతర అవసరమైన వస్తువులు పంపిణీ చేస్తున్నాడు.

ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్‌లో బయటపడిన కరోనా వైరస్ ప్రస్తుతం 25 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటి వరకు దాదాపు వెయ్యిమంది ప్రాణాలు కోల్పోగా, 40 వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచ మహమ్మారిగా మారిన ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు చాలామంది శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన జాకీచాన్ తాజాగా ఈ ప్రకటన చేశాడు.