రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళం.. ఎవరిచ్చారంటే..?
అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాదాపు మూడు నెలల తర్వాత లోక్‌సభలో రామ్ టెంపుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్ రాజధాని పట్నాలోని మహవీర్ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా తొలుత రూ.2 కోట్లను చెక్కు రూపంలో అందజేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన సొమ్మును దశలవారీగా మందిర నిర్మాణ […]
అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాదాపు మూడు నెలల తర్వాత లోక్‌సభలో రామ్ టెంపుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్ రాజధాని పట్నాలోని మహవీర్ ఆలయ పాలక మండలి రామమందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా తొలుత రూ.2 కోట్లను చెక్కు రూపంలో అందజేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన సొమ్మును దశలవారీగా మందిర నిర్మాణ ట్రస్టుకు అందజేస్తామని తెలిపింది.
కాగా.. మందిర నిర్మాణానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన విరాళాల పెట్టెలో అణాపైస విలువ చేసే ముప్ఫై నాణేలను భక్తులు వేశారని వెల్లడించారు. వీటిపై సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలు ఉన్నట్లు తెలిపారు. ఈ పురాతన నాణేలను ఈస్ట్ ఇండియా కంపెనీ 1818లో ముద్రించినట్లు పేర్కొన్నారు.