తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్లు.. రూ.11వేల కోట్ల పెట్టుబడులు..!

ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు 11,624 కోట్ల (1.6 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో రెండు డేటా సెంటర్లు నిర్మించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ శివారులో రెండు ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. అమెజాన్ పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాల పైనే పెట్టనుంది. ఇవి రెండు తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి సాయం […]

తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్లు.. రూ.11వేల కోట్ల పెట్టుబడులు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 11, 2020 | 5:31 AM

ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దాదాపు 11,624 కోట్ల (1.6 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో రెండు డేటా సెంటర్లు నిర్మించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ శివారులో రెండు ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. అమెజాన్ పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్, స్టోరేజ్ పరికరాల పైనే పెట్టనుంది. ఇవి రెండు తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి సాయం చేయనున్నాయి.

హైదరాబాద్ శివార్లలో డేటా సెంటర్ల నిర్మించేందుకు అమెజానా డేటా సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (ADSIPL) పర్యావరణ అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. రెండింటిలో ఓ డేటా సెంటర్‌ను శంషాబాద్ మండలంలోని చందన్‌వల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుండగా, రెండోదానిని కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట గ్రామంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాంతం హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు పరిధిలో ఉంది. చందన్‌వల్లిలో 66,003 చదరపు మీటర్లు, మీర్‌ఖాన్‌పేటలో 82,833 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తారు.