ఓపెనర్‌గా రాహుల్.. మిడిల్ ఆర్డర్‌లో పంత్..

India Vs New Zealand: టీమిండియా టీ20 సిరీస్‌‌ను గెలిచిందని సంతోషించేలోపు సీన్ కాస్తా రివర్స్ అయింది. పేలవమైన ప్రదర్శనతో వన్డే సిరీస్‌లో 0-2తో వెనకబడి నిరాశపరిచింది. బౌలింగ్, ఫీల్డింగ్‌ తప్పిదాలతో ఘోరంగా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే కనీసం ఆఖరి వన్డేలోనైనా భారత్ విజయం సాధించి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రెగ్యులర్ ఓపెనర్స్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు లేని లోటు ఈ సిరీస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ […]

ఓపెనర్‌గా రాహుల్.. మిడిల్ ఆర్డర్‌లో పంత్..
Follow us

|

Updated on: Feb 11, 2020 | 6:32 AM

India Vs New Zealand: టీమిండియా టీ20 సిరీస్‌‌ను గెలిచిందని సంతోషించేలోపు సీన్ కాస్తా రివర్స్ అయింది. పేలవమైన ప్రదర్శనతో వన్డే సిరీస్‌లో 0-2తో వెనకబడి నిరాశపరిచింది. బౌలింగ్, ఫీల్డింగ్‌ తప్పిదాలతో ఘోరంగా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే కనీసం ఆఖరి వన్డేలోనైనా భారత్ విజయం సాధించి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రెగ్యులర్ ఓపెనర్స్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు లేని లోటు ఈ సిరీస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లపైనే పరుగుల భారమంతా పడింది. అటు కీపింగ్ బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో దిగుతుండటంతో మెరుపులు ఏమేరకు సరిపోట్లేదు.

ఇక కొత్త ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌‌లు శుభారంభాన్ని అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం రాణించట్లేదు. బౌలింగ్ విషయానికి వస్తే గాయం నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్ళీ తన లయను అందుకోవాలి. ఇలా ఒకటేమిటి జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. అయితే ఈ మూడో మ్యాచ్‌లో మాత్రం పలు కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా దిగనుండగా.. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు పృథ్వి షా, కేదార్ జాదవ్‌లకకు విశ్రాంతినిచ్చి శివమ్ దూబే‌ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొదటి రెండు వన్డేలు గెలిచి జోష్ మీద ఉన్న కివీస్.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి రావడం తమకు బలాన్ని చేకూర్చిందని బౌలర్ టీమ్ సౌథీ అభిప్రాయపడ్డాడు.