YS Viveka Murder Case: సీబీఐ విచారణలో వెలుగులోకి వస్తున్న అసలు నిజాలు.. ఇవాళ పులివెందుల వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించిన అధికారులు!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వస్తూనే ఉన్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి.

YS Viveka Murder Case: సీబీఐ విచారణలో వెలుగులోకి వస్తున్న అసలు నిజాలు.. ఇవాళ పులివెందుల వైసీపీ కార్యకర్తలను ప్రశ్నించిన అధికారులు!
Cbi Speeds Up Investigation On Ys Vivekananda Reddy Case
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 14, 2021 | 4:45 PM

YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వస్తూనే ఉన్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ కొత్త కొత్త కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కరిని విచారిస్తే మరో కొత్త క్లూ అన్నట్టుగా.. మరొకరికి దగ్గరికి వెళ్తోంది. ఇలా సీబీఐ చేపట్టిన విచారణ కొద్ది రోజులుగా వేగంగా సాగుతోంది.

ఇవాళ ఎనిమిదో రోజు కూడా సీబీఐ విచార‌ణ చేపట్టింది. క‌డ‌ప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితుల‌ను పిలిపించి ప్రశ్నిస్తున్నారు. సోమవారం కూడా పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌, సునీల్‌ కుమార్‌‌ల తండ్రి కృష్ణయ్యలను విచారించారు. ఈ హ‌త్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకా మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్తగిరి, కంప్యూట‌ర్ ఆప‌రేటర్‌గా ప‌ని చేసిన‌ ఇనాయ‌తుల్లాతో పాటు కిర‌ణ్‌, సునీల్‌ల‌ను సీబీఐ అధికారులు ఇప్పటికే ప‌లుమార్లు ప్రశ్నించిన విష‌యం తెలిసిందే.

కాగా, వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఆయన ఇంటి పరిసరాల్లో కొన్ని అనుమానిత వాహనాలు తిరిగినట్టు సీబీఐ గుర్తించింది. దీనికి బలం చేకూర్చేందుకు AP 4-1189 నెంబర్‌ గల ఇన్నోవా వాహనం ఓనర్‌ ఐన అరకటవేముల రవి, డ్రైవర్‌ గోవర్ధన్‌లను కలిపి విచారణ చేశారు. వీరి ద్వారా వచ్చిన ఇన్‌ఫర్మేషన్‌ను రికార్డు చేసుకున్నారు. రవాణా శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇన్నోవా వాహనం యజమానిని విచారించినట్టు సమాచారం.

దీంతో ఈ కేసు విచారణలో కీలకంగా మారింది ఇన్నోవా కారు. హత్యకు ముందు ఇన్నోవా కారులో వచ్చిన వారిపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఇనాయతుల్లాను విచారించారు. అటు తర్వాత సునీతారెడ్డితో కలిసి వివేకా నివాసాన్ని పరిశీలించారు సీబీఐ అధికారులు. ఇలా దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. నాలుగు విడతలుగా సాగుతున్న ఈ కేసును ముందుగా కడప, పులివెందుల, ఢిల్లీ కేంద్రంగా విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు వరకు అనుమానితులను, వివేకాఅనుచరులను, సన్నిహితులతోపాటు జిల్లా రవాణా శాఖ అధికారులను సైతం సీబీఐ అధికారులు విచారించారు.

మరోవైపు గత కొన్ని నెలలుగా వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని కూడా సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో వివేకానంద కేసులో కీలక సమాచారం లభించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ కుమార్ వివేకాకు అత్యంత స‌న్నిహితుడిగా ఉండేవాడ‌ని పులివెందుల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల కింద‌ట సీబీఐ అధికారులు పులివెందులోని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌శ్నించారు. దీంతో పాటు ఆదివారం వివేకా ఇంటిని కూడా మూడు గంట‌ల పాటు అధికారులు ప‌రిశీలించారు.

Read Also…  Monuments, Museums Reopen: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. ఈనెల 16 నుంచి తాజ్ మహల్ సహా అన్ని చారిత్రాత్మక ప్రదేశాలు ఓపెన్