AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Journalist Dies in Road Crash: రోడ్డుప్రమాదంలో జర్నలిస్ట్ మృతి.. లిక్కర్ మాఫియా నుంచి రక్షణ కోరిన రెండు రోజులకే ఘటన!

యూపీ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసి బెదిరింపులు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

UP Journalist Dies in Road Crash: రోడ్డుప్రమాదంలో జర్నలిస్ట్ మృతి.. లిక్కర్ మాఫియా నుంచి రక్షణ కోరిన రెండు రోజులకే ఘటన!
Up Journalist Dies In Road Crash
Balaraju Goud
|

Updated on: Jun 14, 2021 | 5:31 PM

Share

UP Journalist Dies in Road Crash: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ చానల్ రిపోర్టర్ అనుమానాస్పదస్థితిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యూపీ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసి బెదిరింపులు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. 42 ఏళ్ల రిపోర్టర్ సులభ్ శ్రీవాస్తవ లిక్కర్ మాఫియాపై కథనాలు ప్రసారం చేశాడు. దీంతో ఆయన అక్రమ దందా నిర్వహకుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తనకు రక్షణ కల్పించాలంటూ ప్రయాగ్‌రాజ్ ఏడీజీకి లేఖ రాశారు. ఇంతలోనే అతడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

శ్రీవాస్తవ ప్రయాణిస్తున్న బైక్ ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని ఒక ఇటుక బట్టీ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఓ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆదివారం అతడు అస్రాహీ గ్రామం నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఏఎస్పీ సురేంద్ర ద్వివేదీ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీవాస్తవను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఈ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

అయితే, ఆదివారం లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి మృతుడిని సులభ్ శ్రీవాస్తవ.. అక్రమ ఆయుధాల తయారీ యూనిట్ గురించి వార్తలను సేకరించిన తరువాత తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అతని ప్రమాదానికి సంబంధించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో, తోటి రిపోర్టర్ అంబులెన్స్‌తో సంఘటన స్థలానికి చేరుకుని శ్రీవాస్తవను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. అతని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని ఏఎస్పీ సరేంద్ర ద్వివేదీ తెలిపారు.

ఇదిలావుండగా, జర్నలిస్ట్ మృతిపై కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. , “అలీగఢ్ నుండి ప్రతాప్‌గఢ్ వరకు మద్యం మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతుందని, రాష్ట్రంలో లిక్కర్ మాఫియా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే. యూపీ ప్రభుత్వం మౌనంగా ఉందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. నిజాలు బయటపెడుతున్న జర్నలిస్టులపై ఆగడాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ను పోషించే యుపీ ప్రభుత్వానికి, జర్నలిస్ట్ సులాబ్ శ్రీవాస్తవ కుటుంబ సభ్యుల కన్నీళ్లకు సమాధానం చెప్పగలదా” అని ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Read Also…  Muslim Man Thrashed: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. ముస్లిం వృద్ధుడిని కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆపై అందరూ కలిసి..