Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్‎తో పాటు అరెస్టైన మోడల్ ఎవరో తెలుసా..?

సముద్రం మధ్యలో క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‎ వాడుతూ దొరికిపోయిన షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరికొందరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. ఆర్యన్‎తో పాటు..

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్‎తో పాటు అరెస్టైన మోడల్ ఎవరో తెలుసా..?
Modal
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 04, 2021 | 6:03 PM

సముద్రం మధ్యలో క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‎ వాడుతూ దొరికిపోయిన షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరికొందరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. ఆర్యన్‎తో పాటు అర్బాజ్ సేథ్ మర్చంట్, ఓ మోడల్‎ను ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది.

మున్మున్ ధమేచా ఎవరు? మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని వ్యాపార కుటుంబానికి చెందిన మున్మున్ ధమేచా ఒక వర్ధమాన మోడల్. ఆమె వయసు 39 సంవత్సరాలు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ఆమె సోదరుడు ప్రిన్స్ ధమేచా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆమె తన సోదరుడితో కలిసి కొన్నాళ్లు భోపాల్‎లో ఉంది. తర్వాత ఢిల్లీకి వెళ్లింది. మున్మున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తన టూర్ల ఫొటోలు, మోడలింగ్ ప్రాజెక్ట్‌లను సోషల్ మీడియాలో అప్డేడ్ చేస్తుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10.9k పాలోవర్స్ ఉన్నారు. 2019 లో న్యూ ఢిల్లీలోని ఉత్తర ఢిల్లీ క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (IIFT) కోసం ధమేచా ర్యాంప్‌ వాక్ చేసింది. ఆమె అదే సంవత్సరంలో ఆసియన్ డిజైనర్ వీక్‌లో పాల్గొన్నారు. ముంబై నుండి గోవా వరకు క్రడెలియా క్రూయిజ్‌ ఎంప్రెస్ షిప్‎లో జరిగిన రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారు. పార్టీపై ఎన్‌సీబీ ఆకస్మిక దాడి చేసిఎన్‌సీబీ ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ సేథ్ మర్చంట్, మున్మున్ ధమేచాను అదుపులోకి తీసుకుంది.

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్ అరెస్ట్‌ బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్యన్‌ అరెస్ట్‌తో బాలీవుడ్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. షారుక్ సన్నిహితులు, స్నేహితులు… అతని నివాసానికి క్యూ కట్టారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా షారుక్ ఇంటికి వచ్చి పరామర్శించారు. ఎన్‌సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్‌ ఖాన్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆర్యన్ నిన్నట్నుంచి భోజనం కూడా చేయలేదు. ఎన్‌సీబీ ఇచ్చిన ఆహారాన్ని తినేందుకు ఆర్యన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్‌సీబీ ఇంటరాగేషన్‌లోనూ ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడు. ఏం అడిగినా ఏడుపు తప్ప… ఎలాంటి సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది.

Read Also..  Shah Rukh Khan Son: ఆర్యన్‌ఖాన్‌ s/o షారూక్‌. నాలుగేళ్లుగా డ్రగ్స్‌కు బానిస. ఇండియా, ఫారిన్.. ఎక్కడికెళ్లినా భారీ వినియోగం.!