AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Humanity: పక్షవాతంతో తండ్రి.. ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకు, కూతురు.. ఆదరించిన స్థానికులు ఎక్కడంటే..

Humanity: ఓ వైపు జంతువులు జాతి వైరాన్ని మరచి ఆకలి తీర్చేవి కొన్నైతే.. ఆపదలో ఉంటె  ఆదుకుంటున్న జంతువులు కొన్ని.. అయితే మంచి..

Humanity: పక్షవాతంతో తండ్రి.. ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకు, కూతురు.. ఆదరించిన స్థానికులు ఎక్కడంటే..
Humanity
Surya Kala
|

Updated on: Oct 04, 2021 | 7:20 PM

Share

Humanity: ఓ వైపు జంతువులు జాతి వైరాన్ని మరచి ఆకలి తీర్చేవి కొన్నైతే.. ఆపదలో ఉంటె  ఆదుకుంటున్న జంతువులు కొన్ని.. అయితే మంచి చెడుల విచక్షణ తెలిసిన మనిషిలో మాత్రం రోజు రోజుకీ స్వార్ధం పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే మాయ మైపోతున్నడమ్మ మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం నేడు అన్న మాటలను గుర్తు చేస్తూ రోజు రోజుకీ సమాజంలో బంధాలు అనుబంధాలు అట్టడుక్కి చేరుకుంటున్నాయి. తమ ఆశలు కోరికలన్నిటిని పక్కకు పెట్టి.. కష్టనష్టాలకోర్చి పిల్లలను పెంచి పెద్ద చేస్తే.. వారికీ రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు భారంగా మారిపోతున్నారు. కొంతమంది కొడుకులు.. తమ భార్యలతో కలిసి.. తమ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. వృద్దాప్యంలో అండగా ఉండి చిన్నపిల్లల్లా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను అనాధల్లా వదిలేస్తున్నారు. రోడ్లపాలు చేసేవారు కొంతమంది అయితే.. అనాథాశ్రమంలో చేర్చేవారు మరికొందరు. అయితే ఇక్కడ కొడుకే కాదు.. తనకు కూడా మానవత్వం లేదని చూపించింది ఓ కూతురు.. ఓ వృద్ధురాలైన తండ్రిని మానవత్వం మరిచి ఇంటి నుండి గెంటి వేశారు. ఈ అమానుష ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గోదావరి ఖని లోని సింగరేణి అర్జీ-1 పరిధిలోని ఒకటవ గనిలో ట్రామర్‌గా శేషాల ఓదేలు పనిచేసేవాడు. అయితే ఐదేళ్ల క్రితం తన ఉద్యోగాన్ని కుమారుడికి డిపెండెంట్ ద్వారా ఇచ్చాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యినప్పటి నుంచి శేషాల  గోదావరిఖనిలోని తిలక్ నగర్‌లో కూతుళ్లతో కలిసి నివసిస్తున్నారు. అయితే అతనికి పక్షవాతం రావడం.. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తాము చాకిరీ చేయలేమని తండ్రిని కూతుర్లు ఇంటి నుంచి గెంటేశారు. కొడుకు తన ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో అతను రోడ్డుమీద పడ్డారు. కాలనీవాసులు అతనిని చేరదీసి ఆదరించారు. రోజుకొకరు చొప్పున అతనికి ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే తన ఉద్యోగాన్ని కుమారుడికి ఇప్పించినా తండ్రిని ఇలా రోడ్ల పాలు చేసిన కుటుంబ సభ్యులతీరుని కాలనీ వాసులు తప్పు పడుతున్నారు.

Also Read: 11 ఏళ్ల వయస్సులో ప్రమాదం.. చక్రాల కుర్చీకే పరిమితం.. నేడు రూ.7000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి