Padi Kaushik Reddy: కౌశిక్‌ రెడ్డి ఫ్యూచర్ ఏంటి..? గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

2018 సాధారణ ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు గట్టిపోటీ ఇచ్చారు కౌషిక్‌రెడ్డి. ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి గులాబీగూటికి చేరారు.

Padi Kaushik Reddy: కౌశిక్‌ రెడ్డి ఫ్యూచర్ ఏంటి..? గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
Padi Koushik Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 04, 2021 | 7:02 PM

2018 సాధారణ ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు గట్టిపోటీ ఇచ్చారు కౌశిక్‌ రెడ్డి. ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి గులాబీగూటికి చేరారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీకి సిఫారసు చేసింది కేబినెట్. MLA కాకున్నా ఎలాంటి ఎన్నిక‌ల త‌ల‌నొప్పులు లేకుండా MLC అవుతున్నానని సంతోష‌ప‌డ్డ కౌశిక్‌ రెడ్డికి అనుకోని పరిస్థితులు ఎదురౌతున్నాయి.  నెలలు గ‌డుస్తున్నా ప్రభుత్వం పంపిన సిఫార్సు పై గవర్నర్‌ ఆమోదముద్ర పడలేదు. అటు హుజురాబాద్ న‌గారా మోగడంతో ఎవ‌రి ప‌నిలో వారు బిజీగా ఉన్నారు. ఈ ఎన్నిక‌కు ముందే MLC అయిపోయి ఆ హోదాలో ప్రచారం చేద్దామనుకున్న కౌశిక్‌ క‌ల‌ల‌కు గవర్నర్ త‌మిళిసై బ్రేకులు వేశారు.

కౌశిక్‌ రెడ్డి ఇష్యూపై గవర్నర్‌ను ఆరా తీసింది మీడియా. స‌మాజ సేవ‌లో ఉన్నవారికి ఇచ్చే ప‌ద‌వి ఇది కాబ‌ట్టి అయ‌న సేవాకార్యక్రమాలపై విచార‌ణ చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ గవర్నర్ ఈ ఫైల్‌ను వెనక్కి పంపితే..మళ్లీ రెండోసారి అదే పేరుతో పంపే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అప్పుడు గవర్నర్ తప్పక ఆమోదించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలా జ‌ర‌గడం లేదు. అచ్చం మ‌హారాష్ట్ర ప‌రిస్థితులు గుర్తుకువస్తున్నాయి. గతంలో అక్కడ కూడా ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. మ‌హా సర్కారు శివ‌సేన‌, NCP పార్టీల నుంచి 12 మంది పేర్లను గవర్నర్‌కు పంప‌గా నెల‌లు గ‌డిచినా నిర్ణయం తీసుకోలేదు గవర్నర్. చివ‌ర‌కు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం అదేశాల త‌రువాత గవర్నర్ కేంద్ర హోంమంత్రిని క‌లిసి ప‌రిస్థితులు వివ‌రించారు. సో.. మహారాష్ట్ర మాదరిగా తెలంగాణ గవర్నర్ కూడా పరిశీలన పేరుతో పెండింగ్‌లో పెడితే ఏళ్ళు గ‌డిచినా ఫ‌లితం ఉండ‌ద‌నేది అర్థం అవుతోంది. మరి TRS సర్కారు కూడా కోర్టు మెట్లు ఎక్కుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. హుజూరాబాద్ ఫ‌లితం తర్వాతే ఈ ఇష్యూపై ఓ క్లారిటీ వస్తుందంటున్నారు విశ్లేషకులు.

Also Read: మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ మృతదేహం లభ్యం.. 10 ఏళ్ల క్రితం తండ్రి కూడా ఇలాగే

కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్న ఆర్యన్ ఖాన్.. ఎన్‌సీబీ అధికారులు ఏం చేశారంటే..?