AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case: కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్న ఆర్యన్ ఖాన్.. ఎన్‌సీబీ అధికారులు ఏం చేశారంటే..?

ఆర్యన్‌ఖాన్‌ సన్నాఫ్‌ షారూక్‌ ఖాన్‌... నాలుగేళ్లుగా డ్రగ్స్‌కు బానిసయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలోనే కాదు... దుబాయ్, యూకే ఎక్కడికి వెళ్లినా విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకునేవాడని...

Drugs Case: కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్న ఆర్యన్ ఖాన్.. ఎన్‌సీబీ అధికారులు ఏం చేశారంటే..?
Aryan Khan
Ram Naramaneni
|

Updated on: Oct 04, 2021 | 5:34 PM

Share

ఆర్యన్‌ఖాన్‌ సన్నాఫ్‌ షారూక్‌ ఖాన్‌… నాలుగేళ్లుగా డ్రగ్స్‌కు బానిసయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలోనే కాదు… దుబాయ్, యూకే ఎక్కడికి వెళ్లినా విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకునేవాడని ఎన్‌సీబీ వర్గాలు చెబుతున్నాయ్. అకేషన్ ఏదైనా డ్రగ్స్ మాత్రం కామన్‌గా ఉండేవి. ఫ్రెండ్స్‌తో కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకునేవాడని ఎన్సీబీ చెబుతోంది. ఎన్సీబీ ఇంటరాగేషన్‌లో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆర్యన్‌ నాలుగేళ్లుగా డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. ఎన్సీబీ ఇంటరాగేషన్‌లో ఆర్యన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆర్యన్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం షారుఖ్ అండ్ గౌరీఖాన్‌కు తెలుసంటున్నాయి ఎన్సీబీ వర్గాలు. విచారణ సమయంలో ఆర్యన్‌ ఖాన్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. ఎన్సీబీ ఇంటరాగేషన్‌లో ఏం అడిగినా ఏడుపు తప్ప… ఆన్సర్ మాత్రం చెప్పడం లేదట. ఆర్యన్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడంతో షారుక్‌తో ఫోన్లో మాట్లాడించారు. ల్యాండ్ లైన్ ద్వారా రెండే రెండు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.

ఆర్యన్ తరపున అతని లీగల్ లీమ్ రంగంలోకి దిగింది. ఆర్యన్‌ బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్యన్‌ ఎప్పుడు డ్రగ్స్‌ తీసుకోలేదని, క్రూయిజ్‌లో ఆర్యన్‌ దగ్గర డ్రగ్స్‌ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులంటున్నారు. ముంబై డ్రగ్స్ కేసులో నిందితులపై ఇళ్లపై ఎన్సీబీ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. ఢిల్లీలో గోమిత్‌ చోప్రా ఇంట్లో సోదాలు చేస్తున్నారు. షారూక్ నివాసంలోనూ రైడ్స్ చేసేందుకు ఎన్సీబీ రెడీ అవుతోంది. ఆర్యన్ ఖాన్ తండ్రికి తగ్గ తనయుడేనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తండ్రి షారుక్ బాటలోనే ఆర్యన్ వెళ్లాడు, అతని తప్పేముందంటూ కామెంట్స్ చేస్తున్నారు. డ్రగ్స్, సెక్స్, మందు, విందు, ఎంజాయ్‌మెంట్‌పై 20ఏళ్లు క్రితం షారుక్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

జీవితమంటే ఎంజాయ్ చేయాలి. డ్రగ్స్, సెక్స్, సిగరెట్, మందు, విందు అన్నీ ఉండాలి. అసలు ఇవన్నీ పెద్ద విషయమే కాదు. 20ఏళ్లు క్రితం షారుక్ ఇచ్చిన సందేశమిది. మరి, తండ్రి సందేశాన్ని తనయుడు తీసుకున్నట్టున్నాడు. యాజటీజ్‌గా ఫాలో అయిపోయాడు. క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా ఇన్ఫర్మేషన్‌తోనే ఎన్సీబీ రైడ్స్ చేసి ఆర్యన్ సహా 8మంది ప్రముఖులను అరెస్ట్ చేసింది. ఆర్యన్‌ సెల్‌ఫోన్‌ను NCB సీజ్ చేసింది. ఆర్యన్‌ ఫోన్‌లోని సమాచారం ద్వారా డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్స్ తీసుకునే బాలీవుడ్‌ నటీనటుల చిట్టా బయటపడే అవకాశం కనిపిస్తోంది.

Also Read: ‘రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్‌’.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

వారెవ్వా.. ఈయనండి లీడర్ అంటే.. తన కారుకు చలాన్ వేసిన ఎస్ఐకి కేటీఆర్ సన్మానం