CM Jagan: ‘రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్’… సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో మిషన్ డ్రగ్ ఫ్రీ స్టేట్ కోసం అందరూ పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. సైబర్ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు ఆదేశించారు.
లా అండ్ ఆర్డర్‌పై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. దిశ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాలను అరికట్టడం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం వాలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలన్నారు. కాలేజ్, యూనివర్సిటీలపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. మిషన్ డ్రగ్ ఫ్రీ స్టేట్ కోసం అందరూ పనిచేయాలని చెప్పారు. సైబర్ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు జగన్ ఆదేశించారు.
ఇప్పటివరకూ 74,13,562 మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేశారని పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. దిశ యాప్ ద్వారా 5238 మందికి సాయం అందించినట్లు వివరించారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామన్నారు. దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ వచ్చిందని వివరించారు. మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామని పోలీసులు వివరించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నామని.. ఫోరెన్సిక్ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలులో వేగం పెరిగిందని పోలీసులు తెలిపారు. గతంలో డీఎన్‌ఏ రిపోర్టు కోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు.
Also Read: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు