Murder In Hyderabad: మేడ్చల్‌లో దారుణం.. మహిళ నగలు దోచుకొని ఆపై అత్యాచారం, హత్య. బండరాళ్ల మధ్య మృతదేహం.
Murder In Hyderabad: హైదరాబాద్ మేడ్చల్‌లో దారుణం జరిగింది. అడ్డా కూలీగా పనిచేస్తోన్న ఓ మహిళను కొందరు గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ సంఘటన...
Murder In Hyderabad: హైదరాబాద్ మేడ్చల్‌లో దారుణం జరిగింది. అడ్డా కూలీగా పనిచేస్తోన్న ఓ మహిళను కొందరు గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలం చంద్రబండ తండాకు చెందిన భామిని (39) అనే మహిళ కుటుంబంతో కలిసి మేడ్చల్ జిల్లా మల్లంపేటకు జీవనోపాధి కోసం వచ్చింది. ఈ క్రమంలోనే స్థానికంగా అడ్డా కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఇక తాజాగా ఈ నెల 25న కూలీ పని ఉందని ఇద్దరు వ్యక్తులు భామినిని తీసుకెళ్లారు. అయితే ఆ రోజు రాత్రి భామిని ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం జిన్నారం మండలం మాదారం పంచాయతీ మంత్రికుంట అటవీ ప్రాంతంలో బండరాళ్ల మధ్య మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ డీఎస్పీ లింగారెడ్డి, దుండిగల్ సీఐ రమణారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ విఘత జీవిగా పడి ఉన్న మహిళ.. మూడు రోజుల క్రితం మిస్సింగ్ అయిన భామినిగా గుర్తించారు. సదరు మహిళ ఒంటిపై ఉన్న నగలు దోచుకొని అనంతరం అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు భామినిని పనికోసం తీసుకెళ్లిన స్వామి, నర్సమ్మను విచారిస్తున్నారు. ఇంతకీ భామినిని ఎవరు చంపారు అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Gang War: బెంగళూరు హిజ్రాలు Vs రాయలసీమ హిజ్రాలు.. సినిమా స్టైల్లో గ్యాంగ్ వార్
Black magic: కరోనా కల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆది, గురు వారాలు వచ్చాయంటే వణుకే