AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder Mystery: అంకెరాళ్ల గుట్టల్లో అంతుచిక్కని హత్యలు.. అడ్డా మహిళా కూలీలే టార్గెట్.. పోలీసుల అదుపులో..

గుట్టల్లో మహిళా డెడ్‌బాడీ. ఎన్ని రోజుల క్రితం చనిపోయిందో ఏమో తెలియదు గాని, డెడ్‌ బాడీని పోలీసులు గుర్తించారు. డెడ్‌బాడీ చూస్తే.. అనేక అనుమానాలు కల్గుతున్నాయి. అన్ని రోజులైనా..

Murder Mystery: అంకెరాళ్ల గుట్టల్లో అంతుచిక్కని హత్యలు.. అడ్డా మహిళా కూలీలే టార్గెట్.. పోలీసుల అదుపులో..
Murder
Sanjay Kasula
|

Updated on: Jul 29, 2021 | 2:32 PM

Share

గుట్టల్లో మహిళా డెడ్‌బాడీ. ఎన్ని రోజుల క్రితం చనిపోయిందో ఏమో తెలియదు గాని, డెడ్‌ బాడీని పోలీసులు గుర్తించారు. డెడ్‌బాడీ చూస్తే.. అనేక అనుమానాలు కల్గుతున్నాయి. అన్ని రోజులైనా.. అక్కడ డెడ్‌బాడీ ఉందన్న సంగతి ఎవరికి తెలియక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇలా 12 మంది మహిళలను హత్య చేసినట్లు తేలింది.

హైదరాబాద్‌ మేడ్చల్‌లో దారుణం జరిగింది. అడ్డా కూలీగా పనిచేస్తోన్న ఓ మహిళను కొందరు గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలం చంద్రబండ తండాకు చెందిన భామిని (39) అనే మహిళ కుటుంబంతో కలిసి మేడ్చల్‌ జిల్లా మల్లంపేటకు జీవనోపాధి కోసం వచ్చింది. ఈ క్రమంలోనే స్థానికంగా అడ్డా కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఇక తాజాగా ఈ నెల 25న కూలీ పని ఉందని ఇద్దరు వ్యక్తులు భామినిని తీసుకెళ్లారు. అయితే ఆ రోజు రాత్రి భామిని ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం జిన్నారం మండలం మాదారం పంచాయతీ మంత్రికుంట అటవీ ప్రాంతంలో బండరాళ్ల మధ్య మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్‌ డీఎస్పీ లింగారెడ్డి, దుండిగల్‌ సీఐ రమణారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ విఘత జీవిగా పడి ఉన్న మహిళ.. మూడు రోజుల క్రితం మిస్సింగ్ అయిన భామినిగా గుర్తించారు. సదరు మహిళ ఒంటిపై ఉన్న నగలు దోచుకొని అనంతరం అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారం గ్రామ సమీపంలో మంత్రికుంటా అంకెరాళ్ల గుట్ట ఇది. అక్కడ పడి ఉన్న డెడ్‌బాడీ ఇప్పుడు కలకలం రేపుతోంది. దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డా కూలి మహిళపై మిస్సింగ్ కేసు నమోదైంది.

ఆ కోణంలోనే కేసు నమోదు చేసిన దుందిగల్, బొల్లారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్ధలాన్ని మేడ్చల్ డీఎస్సీ లింగారెడ్డి, దుండిగల్ సీఐ రాంరెడ్డి పరిశీలించారు. ఘటనపై ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..

Jhunjhunwala New Plan: బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కొత్త ప్లాన్.. సామాన్యుల కోసం ప్రత్యక్ష వ్యాపారంలోకి..

TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే