Road Accident: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం
Suryapet Road Accident: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం
Suryapet Road Accident: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన మునగాల మండలంలోని మాధవరం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మృతులు కోదాడ సాలర్జంగ్‌పేటకు చెందిన గాధరి ఫ్రాన్సిస్ (56), ఎల్లమ్మ (53)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సాలర్జంగ్‌పేటలో విషాదం నెలకొంది.
Also Read: