భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో దివంగత నటుడి కుమారుడు అరెస్టు.. అసలు సంగతి ఇదే..
దివంగత దక్షణాది నటుడు రాజన్ పి.దేవ్ కుమారుడు ఉన్ని రాజన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను హింసించి, ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఆరోపణల కింద ఉన్నిని నెడుమంగడ్ పోలీసులు
దివంగత దక్షణాది నటుడు రాజన్ పి.దేవ్ కుమారుడు ఉన్ని రాజన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను హింసించి, ఆత్మహత్యకు ఉసిగొల్పిన ఆరోపణల కింద ఉన్నిని నెడుమంగడ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఉన్ని దేవ్ కూడా పలు మలయాళ చిత్రాల్లో నటించాడు. నేదుమంగాడ్ పోలీసు బృందం ఎర్నాకుళం జిల్లాలోని తన ఇంటికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుంది.
నేదుమంగాడ్ పోలీసులు ఎర్నాకుళం జిల్లాలోని తన ఇంటికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకుంది. ముందుగా అతను కోవిడ్ నెగెటివ్ అని నిర్దారించుకున్న తర్వాతే అతడిని అదుపులోకి తీసుకున్నట్లుగా అక్కడి పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఉన్ని దేవ్ భార్య మే 12 న వట్టాపర వద్ద తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ఒక్కరోజు ముందు ఆమె గృహహింస ఫిర్యాదు చేసింది. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక సోదరుడు కూడా ఉన్ని ఇంట్లో ఆమె ఎదుర్కొన్న హింసల గురించి ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు.
ఉన్ని, ప్రియాంక 2019 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె ఒక ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్‌గా పనిచేసింది. ప్రియాంక సోదరుడు చెప్పిన కథనం ప్రకారం.. వారి వైవాహిక జీవితం మొదట్లో బాగానే ఉంది. కొంతకాలం తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఆమె తన ఇంటికి రావాలని నిశ్చయించుకుని వచ్చిన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఉన్ని తండ్రి రాజన్ పి. దేవ్ విశేష ప్రజాదరణ పొందిన సినీ నటుడు. 200 కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన 2009 లో కన్నుమూశారు. తెలుగులో ‘ఆది’, ‘దిల్’, ‘ఒక్కడు’, ‘ఖుషి’, ‘గుడుంబా శంకర్’ లాంటి సినిమాలలో నటించారు.