AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: యాంకర్‌ వింధ్యా విశాఖను ప్రశంసించిన సోనూసూద్.. ఎందుకో తెలుసా..?

Sonu Sood - vindhya vishaka: నటుడు సోనూసూద్ కరోనా ప్రారంభం నాటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తూ... రియల్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. అటు సినిమాలతోపాటు..

Sonu Sood: యాంకర్‌ వింధ్యా విశాఖను ప్రశంసించిన సోనూసూద్.. ఎందుకో తెలుసా..?
Sonusood
Shaik Madar Saheb
|

Updated on: May 27, 2021 | 11:48 AM

Share

Sonu Sood – vindhya vishaka: నటుడు సోనూసూద్ కరోనా ప్రారంభం నాటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తూ… రియల్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. అటు సినిమాలతోపాటు.. ఇటు సేవలోనూ ముందుండి ఎంతోమందికి దానకర్ణుడిగా నిలిచారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సోనూ.. తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖపై ప్రశంసలు కురిపించారు. మీరు నిజమైన రాక్‌స్టార్.. అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని యాంకర్‌ వింధ్యా విశాఖ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో సోనూసూద్‌ మాట్లాడుతూ.. ‘‘హాయ్‌ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సాయానికి చిన్న ‘థాంక్స్‌’ అనే పదం సరిపోదు. సోనూసూద్‌ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన రాక్‌స్టార్‌. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది.. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ సోనూసూద్ పేర్కొన్నారు.

అయితే.. కరోనా ప్రారంభం నాటి నుంచి సోనూసూద్‌ ఎంతోమంది పేదలను ఆదుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖ తన వంతు సాయంగా సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం అందించారు. తన కాస్టూమ్స్‌ను వేలం వేసి వచ్చిన నగదు మొత్తాన్ని ఫౌండేషన్‌కు పంపించారు. దీనిపై సోనూసూద్‌ స్పందించి.. ప్రత్యేకంగా వీడియో రూపంలో వింధ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.

యాంకర్ వింధ్యా విశాఖ పలు టీవీ షోలతో పాటు ఐపీఎల్‌, ప్రొ కబడ్డీ లీగ్‌లకు కూడా ప్రెజంటర్‌గా వ్యవహరిస్తోంది. సోనూసూద్‌ స్వయంగా స్పందించి తనకు బదులివ్వడంపై వింధ్యా సంతోషం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది.

Also Read:

Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశే.. సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే..?

అమెజాన్‌ చేతికి మీడియా కంపెనీ ఎమ్‌జీఎమ్‌.. శతాబ్ద కాలం అనుభవం ఉన్న ఈ స్టూడియో ఇప్పుడు ఈ కంపెనీ సొంతం..