Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశే.. సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే..?

Sarkaru Vaari Paata first look : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి ఆసక్తితో

Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశే.. సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే..?
Mahesh Babu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 27, 2021 | 10:10 AM

Sarkaru Vaari Paata first look : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని అందరూ అటు టాలీవుడ్‌ల.. ఇటు అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో అభిమానులకు చిత్రబృందం నుంచి నిరాశ ఎదురయ్యింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మహేశ్‌ తదుపరి చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్‌ ట్వీటర్‌ వేదికగా వెల్లడించింది. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

ఈ మేరకు మహేష్ బాబు టీమ్ ఈ విధంగా ట్విట్ చేసింది. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. మహేశ్ తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్రబృందం భావించింది. సినిమా అప్‌డేట్‌ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దంటూ కోరింది. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌నైనా అధికారిక సైట్లల్లో తప్పకుండా పోస్ట్‌ చేస్తాం… అప్పటివరకూ దయచేసి జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా జీవించండి.. అంటూ టీమ్‌ వెల్లడించింది.

మహేశ్ సర్కారువారి పాట సినిమాకు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యర్నేని, రవిశంర్, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ కథాయికగా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూట్‌ దుబాయ్‌లో జరిగింది. మరోవైపు ఈ సినిమాలో మహేశ్‌.. పొడవాటి జుట్టు, మెడపై పచ్చబొట్టుతో మాస్‌ అండ్ క్లాస్ లుక్‌‌లో విభిన్నంగా కనిపించనున్నారు.

Also Read:

RRR Movie Updates: రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై మరో కీలక అప్‌డేట్స్‌.. కనివిని ఎరుగని రీతిలో బిజినెస్‌

Acharya: ‘ఆచార్య’ మూవీలో చ‌ర‌ణ్ క్యారెక్టర్‌ ప్రీ క్లైమాక్స్‌లో చ‌నిపోతుందా.. ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతున్న న్యూస్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే