RRR Movie Updates: రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై మరో కీలక అప్‌డేట్స్‌.. కనివిని ఎరుగని రీతిలో బిజినెస్‌

RRR Movie Updates: రాజమౌళి మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అప్‌డేట్స్‌పై ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో.

RRR Movie Updates: రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై మరో కీలక అప్‌డేట్స్‌.. కనివిని ఎరుగని రీతిలో బిజినెస్‌
RRR Movie Updates
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2021 | 8:12 AM

RRR Movie Updates: రాజమౌళి మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అప్‌డేట్స్‌పై ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. అయితే కోవిడ్‌ మహమ్మారి కారణంగా మూవీ చిత్రీకరణ సైతం వాయిదా పడింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరోసారి కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఈ మూవవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయింది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను హోల్‌సేల్‌గా సొంతం చేసుకుంది. వీళ్లే అన్ని భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించి బిజినెస్ డీల్ పూర్తి చేశారు.

అయితే ఈ మూవీని డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.

ఇవీ చదవండి:

Transgenders : ట్రాన్స్ జెండర్స్ కు కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 15 వందల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి..

Major Movie: కరోనా ఎఫెక్ట్.. విడుదల వాయిదా వేసుకున్న అడవిశేష్ ‘మేజర్’ సినిమా.. త్వరలోనే …