AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major Movie: కరోనా ఎఫెక్ట్.. విడుదల వాయిదా వేసుకున్న అడవిశేష్ ‘మేజర్’ సినిమా.. త్వరలోనే …

టాలీవుడ్ లో విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న హీరో అడవిశేష్ . ఇంట్రస్టింగ్ కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో

Major Movie: కరోనా ఎఫెక్ట్.. విడుదల వాయిదా వేసుకున్న అడవిశేష్ 'మేజర్' సినిమా.. త్వరలోనే ...
Rajeev Rayala
|

Updated on: May 26, 2021 | 11:20 PM

Share

Major Movie: టాలీవుడ్ లో విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న హీరో అడవిశేష్ . ఇంట్రస్టింగ్ కథలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే అడవిశేష్ మేజర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాను జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు రావడం లేదని తెలుస్తుంది.

సయీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ – A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది. శేష్ ఈ చిత్రానికి కథ-కథనం అందించారు. కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగు జరుపుకోలేకపోయింది. షూటింగు విషయంలో వచ్చిన గ్యాప్ ప్రభావం సహజంగానే విడుదల తేదీపై పడుతుంది. అందువలన ఈ సినిమాను ముందుగా చెప్పిన సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ” ప్రస్తుతం మనమంతా కష్ట కాలంలో జీవిస్తున్నాం. మీరు అన్ని భద్రతా ప్రోటోకాల్ లను అనుసరిస్తున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాం. నిజానికి  జూలై 2న ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదలకు షెడ్యూల్ చేయబడిన మేజర్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం .” అని తెలిపింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన మహేష్ హీరోయిన్.. మరోసారి ఆ స్టార్ హీరోతో నటించనున్న కీర్తి సురేష్

Nandamuri Kalyan Ram: ఇంట్రెస్టింగ్ స్టోరీతో రానున్న కళ్యాణ్ రామ్.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సినిమా..

Mahesh Babu: టాలీవుడ్ లో మహేష్ ఒక్కడే సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు…