Nandamuri Kalyan Ram: ఇంట్రెస్టింగ్ స్టోరీతో రానున్న కళ్యాణ్ రామ్.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సినిమా..
నందమూరి కళ్యాణ్ రామ్ కుఇప్పడు సాలిడ్ సక్సెస్ కావలి. అప్పుడెప్పుడో అనీల్ రావిపూడి త్తెరకెక్కించిన పటాస్ సినిమాతర్వాత ఇంతవరకు హిట్ రుచి చూడలేదు కళ్యాణ్ రామ్
kalyan ram : నందమూరి కళ్యాణ్ రామ్ కుఇప్పడు సాలిడ్ సక్సెస్ కావలి. అప్పుడెప్పుడో అనీల్ రావిపూడి త్తెరకెక్కించిన పటాస్ సినిమాతర్వాత ఇంతవరకు హిట్ రుచి చూడలేదు కళ్యాణ్ రామ్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఎంతమందివాడవురా.. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికానుకగా విడుదలైంది. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమా పైన ద్రుష్టి పెట్టాడు. పవర్ ఫుల్ స్టోరీతో సినిమా చేయాలనీ చూస్తున్నారు కళ్యాణ్ రామ్. ఈ క్రమంలోనే లాక్డౌన్ లో కొంతమంది దర్శకుల కథలను విన్నాడట. ఇకపై తదుపరి సినిమాల విషయంలో కళ్యాణ్ రామ్ జాగ్రత్తపడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో ఓ నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో కళ్యాణ్ మూడు పాత్రలలో కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. కళ్యాణ్ రామ్ ఇదివరకు ద్విపాత్రభినయం చేసాడు కానీ త్రిపాత్రభినయం చేయడం ఇదే మొదటిసారి.
ఇక ఈ దర్శకుడితో పాటు మరో దర్శకుడికి కూడా కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2019లో ఓకే చేసిన ఈ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో టైం ట్రావెల్ గురించి రూపొందనుంది. తాజాగా మేకర్స్ సినిమాను అధికారికంగా కన్ఫర్మ్ చేస్తూ మే 28న టైటిల్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్వ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఢిల్లీని పాలించిన తుగ్లక్ రాజవంశం నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుందని అంటున్నారు.
A time travel from Evil to Good. Get ready for the powerful title reveal of the socio fantasy extravaganza #NKR18 on May 28th at 12pm. @NANDAMURIKALYAN in a never seen before role ! #Vashist pic.twitter.com/GcNBA9Oewd
— NTR Arts (@NTRArtsOfficial) May 26, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :