AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్‌ చేతికి మీడియా కంపెనీ ఎమ్‌జీఎమ్‌.. శతాబ్ద కాలం అనుభవం ఉన్న ఈ స్టూడియో ఇప్పుడు ఈ కంపెనీ సొంతం..

Amazon: సినిమాల నిర్మాణంలో దాదాపు 100 సంవత్సార అనుభవం ఉన్న ఈ స్టూడియో వద్ద 4,000కు పైగా సినిమా టైటిళ్లు ఉన్నాయి. అంతేకాదు అందులో ‘12 ఆంగ్రీ మెన్‌’, ‘బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌’, ‘క్రీడ్‌’, ‘జేమ్స్‌ బాండ్‌’,..

అమెజాన్‌ చేతికి మీడియా కంపెనీ ఎమ్‌జీఎమ్‌.. శతాబ్ద కాలం అనుభవం ఉన్న ఈ స్టూడియో ఇప్పుడు ఈ కంపెనీ సొంతం..
Amazon
Follow us
Sanjay Kasula

|

Updated on: May 27, 2021 | 8:26 AM

అమెజాన్ కంపెనీ మరో ముందడగు వేసింది. అమెరికాకు చెందిన ఓ మీడియా కంపెనీని కొనుగోలు చేసింది. సినిమాల నిర్మాణంలో శతాబ్ద కాలం అనుభవం ఉన్న కంపెనీని సొంతం చేసుకుంది. ఆ కంపెనీ లైబ్రెరీలో ప్రసిద్దిగాంచిన పెద్ద చిత్రాలు వారి వద్ద ఉన్నాయి. అంతే కాదు ఆ కంపెనీలో ఇప్పటికే  నాలుగు అంకెల సంఖ్యలో  నమోదు చేసుకున్న సినిమా టైటిళ్లు ఉన్నాయి. మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ (ఎమ్‌జీఎమ్‌) ను 8.45 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.63,300 కోట్లు)తో అమెజాన్‌ కొనుగోలు చేయనుంది. ఆ మేరకు రెండు కంపెనీలు ఒక విలీన ఒప్పందం(MoU)పై బుధవారం సంతకాలు చేశాయి.

సినిమాల నిర్మాణంలో దాదాపు 100 సంవత్సార అనుభవం ఉన్న ఈ స్టూడియో వద్ద 4,000కు పైగా సినిమా టైటిళ్లు ఉన్నాయి. అంతేకాదు అందులో ‘12 ఆంగ్రీ మెన్‌’, ‘బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌’, ‘క్రీడ్‌’, ‘జేమ్స్‌ బాండ్‌’, ‘లీగల్లీ బ్లాండ్‌’, ‘మూన్‌స్ట్రక్‌’, ‘రేజింగ్‌ బుల్‌’, ‘రాకీ’, ‘సైలెన్స్‌ ఆఫ్‌ ద లాంబ్స్‌’, ‘టోంబ్‌ రైడర్‌’, ‘ద మాగ్నిఫిషియంట్‌ సెవెన్‌’, ‘ద పింక్‌ పాంథర్‌’ వంటివెన్నో ఆ కంపెనీ లైబ్రరీలో ఉన్నాయి.

అంతే కాదు ‘ఫార్గో’, ‘ద హ్యాండ్‌మెయిడ్స్‌ టేల్‌’, ‘వికింగ్స్‌’ వంటి 17,000కు పైగా టీవీ షోలూ ఉన్నాయి. వీటికి 180కి పైగా అకాడమీ అవార్డులు, 100కు పైగా ఎమ్మీస్‌ అవార్డులు వచ్చినట్లు ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ స్టూడియోస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ హాప్కిన్స్‌ పేర్కొన్నారు.

ఎమ్‌జీఎమ్‌ వద్ద ఉన్న విస్తృత స్థాయిలో ఉన్న ఈ నిధిని ఆ కంపెనీ బృందంతో కలిసి అభివృద్ధి చేయనున్నాట్లుగా ఆ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ హాప్కిన్స్‌ పేర్కొన్నారు . అత్యంత నాణ్యమైన కథలను చెప్పడానికి మాకు మరిన్ని అవకాశాలు వచ్చినట్లేందని ఆయన  అభిప్రయా పడ్డారు.

కాగా, ఈ లావాదేవీకి నియంత్రణపరమైన అనుమతులు, ఇతరత్రా ఆమోదాలు లభించాల్సి ఉంది. కరోనా సమయంలో ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌ వంటి ఓటీటీలకు మరింత ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..